కొత్త కార్లు డీలా ..పాత కార్లు భళా..!

మేరా భారత్ మహాన్ అంటూ నినాదాలు చేస్తున్న, కేంద్రంలో కొలువు దీరిన బీజేపీ ప్రభుత్వంలో అన్ని రంగాలు డీలా పడ్డాయి. ఎప్పుడైతే నరేంద్ర మోదీ నోట్ల రద్దు ప్రకటించారో, ఆరోజు నుంచి నేటి దాకా భారతీయ ఆర్థిక వ్యవస్థ ఇంకా కుదురుకోలేదు. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు. నిజాలు ఒప్పుకున్నారు. అయితే ఇదంతా తాత్కాలికమేనని త్వరలో అంతా సర్దుకుంటుందని నమ్మించే ప్రయత్నం చేస్తోంది విత్త మంత్రి. ప్రజలకు అందుబాటులో ఉంటూ విశిష్టరీతిలో సేవలు అందిస్తున్న బ్యాంకులను కలిపే ప్రతిపాదనపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు , ధర్నాలు , సమ్మెలు ఉద్యోగులు, సిబ్బంది చేపట్టారు.

తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను మోదీ అవలంభిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా స్కిల్ డెవలప్ మెంట్ అంటూ ఊదరగొడుతున్న సర్కారు కనీసం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం లేదు. దేశంలో అన్ని రంగాలు పూర్తిగా నిర్వీర్యమై పోయాయి. ఇదే పరిస్థితి ఇండియాలో కొంచెం మెరుగైన స్థితిలో ఉన్న ఆటోమొబైల్ రంగం కూడా, ఇప్పుడు ఆసరా కోసం ఎదురు చూసే పరిస్థితికి దిగజారింది. కార్ల తయారీలో గత రెండేళ్ల కాలంలో ఏకంగా రెండు లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. సంఘటిత , అసంఘటిత రంగాలకు ఈ సెగ పాకింది. మేకిన్ ఇండియా , కమాన్ ఇండియా అంటూ ఉన్న పీఎం ప్రస్తుతం వాస్తవ పరిస్థితులను గుర్తించడం లేదంటూ మాజీ దేశ ప్రధాన మంత్రి, ప్రపంచం మెచ్చిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మండిపడ్డారు.

ఇలా తయారు కావడానికి మోదీనే కారణమని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక కార్ల తయారీలో ఇండియాలోనే ప్రథమ స్థానంలో ఉన్న మారుతి సుజుకి కంపెనీ ఇప్పుడు రెండు నగరాల్లో ఉన్న కార్ల తయారీ ప్లాంట్లను మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. మరో వైపు కేంద్ర మంత్రి గడ్కరీ రోజుకో మాట మాట్లాడటం కూడా కార్ల కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కార్లు ఇక ఉండవని విద్యుత్ కార్లే ఉంటాయని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా నిరసనలు చెలరేగడంతో వెంటనే తాను అన్న మాటలను వెనక్కి తీసుకున్నారు. అటు బ్యాంకింగ్ వ్యవస్థ , ఇటు వాహన రంగం పూర్తిగా ఇబ్బందుల్లో పడింది. టాటా , హ్యుందాయ్ , ఫోర్డ్, వోక్స్ వాగన్ , ఇన్నోవా, తదితర కంపెనీల వాహనాలు అమ్ముడు పోవడం లేదు. గత ఏడాదితో పోలిస్తే 32 శాతం అమ్మకాలు క్షీణించాయి. దీంతో వేతనాలు, నిర్వహణ భారం మోయలేమంటూ కంపెనీలు ఉన్న ఫలంగా మూసి వేస్తున్నాయి. అయితే వాహనదారులు, ప్రేమికులు మాత్రం లక్షలు పెట్టి కార్లు కొనడం కంటే సెకండ్స్ లో కొనడమే బెటర్ అంటూ వాటికే ప్రయారిటీ ఇస్తున్నారు. మొత్తం మీద మోదీ కొట్టిన దెబ్బకు వాహనాల కంపెనీలు అబ్బా అంటున్నాయి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!