కాషాయం..బహుజనుల జపం..!
ప్రపంచంలోనే సుదీర్ఘమైన రాజకీయ, పోరాట చరిత్ర కలిగిన తెలంగాణాలో అధికారం లోకి రావాలని బీజేపీ కంకణం కట్టుకున్నది. ఆ మేరకు చాప కింద నీరులా ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్రంలో రెండవ సారి కొలువు దీరిన కాషాయ సర్కార్ కు ఇప్పుడు అన్నీ తానే అయి నడిపిస్తున్న మోడీ, అమిత్ షా పరివారం ఎట్టి పరిస్థితుల్లో పవర్ లోకి రావాలని పార్టీ శ్రేణులకు హిత బోధ చేశారు. అందులో భాగంగానే అన్ని పార్టీలకు చెందిన వారు ఎవరైనా, ఏ స్థాయిలో ఉన్నా సరే పార్టీలోకి స్వాగతం పలకాలని., వారికి సముచిత ప్రాధాన్యత ఉంటుందని హై కమాండ్ ఇప్పటికే స్పష్టం చేసింది.
దీంతో సౌత్ ఇండియాలో కన్నడ నాట కొలువు దీరిన బీజేపీ ఇప్పుడు తెలంగాణలో బలమైన టీఆర్ ఎస్ ను ఢీకొనేందుకు పావులు కదుపుతోంది. ఈ రాష్ట్రంలో అత్యధికంగా బీసీలు, మాల, మాదిగలు, మైనార్టీలు, ఇతర కులాల వారున్నారు. గతంలో రెడ్డి , బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాలకే ప్రాధాన్యత ఉండేది ఆ పార్టీలో. ఇప్పుడు దాని ముద్రను పూర్తిగా చెరిపి వేశారు షా. తెలంగాణాలో, ఏపీలో బలమైన కేడర్ కలిగిన తెలుగుదేశం పార్టీకి చెందిన వారంతా ఇప్పుడు బీజీపీ వైపు చూస్తున్నారు. వారిని కూడా అక్కున చేర్చుకుంటోంది. పార్టీ పగ్గాలు సైతం బీసీకి చెందిన లక్ష్మణ్ కు ఇచ్చారు. మహిళలు, యువత, అన్ని వర్గాలకు చెందిన వారితో టచ్ లో ఉంటున్నారు.
రాజకీయ అనుభవం కలిగిన దేవేందర్ గౌడ్, ఆర్ కృష్ణయ్య, మోత్కుపల్లి, తదితర నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. కాంగ్రెస్, అధికార పార్టీకి చెందిన వారు వస్తే చేర్చు కోవాలని డిసైడ్ అయ్యింది. ఒకవేళ పవర్ లోకి వస్తే బీసీకి చెందిన నేతకే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ప్రకటించింది. ఎలాగైనా సరే తెలంగాణాలో దొర పాలనకు చెక్ పెట్టాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకున్నది. అందులో భాగంగానే రాష్ట్రానికి గవర్నర్ గా తమిళసి ని తీసుకు వచ్చారని ఆ పార్టీకి చెందిన శ్రేణులు భావిస్తున్నాయి. మొత్తం మీద షా మాత్రం వెనక్కి తగ్గకుండా దిశా నిర్దేశం చేస్తున్నారు. ఏం జరుగుతుందో ఇక కాలమే సమాధానం చెప్పాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి