అనంతం..అద్భుతం..ఆదాయం

సామాజిక మాధ్యమం అందుబాటులోకి వచ్చాక ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉన్న వాళ్ళు, సామాన్యులు సైతం అందుబాటు లోకి, వెలుగు లోకి వస్తున్నారు. ఇదంతా వాళ్లలో ఉన్న ప్రతిభ, అంతులేని నైపుణ్యం కూడా. అన్నీ ఉన్నా అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇదే సమయంలో సాంకేతిక నైపుణ్యంలో చోటు చేసుకున్న మార్పులు కోట్లాది మందిని కనెక్ట్ అయ్యేలాగా చేస్తోంది. దీంతో అపరిమితమైన అవకాశాలు తలుపు తడుతున్నాయి. టాలెంట్ ఉండి పలు భాషల్లో కొంచెం పట్టు సాధించ గలిగితే చాలు లక్షలు వెనకేసు కోవచ్చు. ఈ దేశంలో ఎందరో మహానుభావులు జన్మించారు. మరికొందరు ఋషులు, యోగులు, స్వాములుగా, మార్గ నిర్దేశకులుగా, జాతికి జీవం పోసేలా తమను తాము మల్చుకుంటున్నారు. ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో కొందరు న్యూమరాలజిస్టులు, ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష్కులు కేవలం సమాజ సేవకే తమ విలువైన కాలాన్ని, జీవితాన్ని వినియోగిస్తున్నారు. ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్న వారికీ మేలు జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. సాధన ద్వారా తాము నేర్చుకున్న మంచి అంశాలు, విషయాలను పామరులకు, సామాన్యులకు అందుబాటులో ఉండేలా చేస్తున్నారు. అలాంటి వార...