అనంతం..అద్భుతం..ఆదాయం

సామాజిక మాధ్యమం అందుబాటులోకి వచ్చాక ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉన్న వాళ్ళు, సామాన్యులు సైతం అందుబాటు లోకి, వెలుగు లోకి వస్తున్నారు. ఇదంతా వాళ్లలో ఉన్న ప్రతిభ, అంతులేని నైపుణ్యం కూడా. అన్నీ ఉన్నా అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇదే సమయంలో సాంకేతిక నైపుణ్యంలో చోటు చేసుకున్న మార్పులు కోట్లాది మందిని కనెక్ట్ అయ్యేలాగా చేస్తోంది. దీంతో అపరిమితమైన అవకాశాలు తలుపు తడుతున్నాయి. టాలెంట్ ఉండి పలు భాషల్లో కొంచెం పట్టు సాధించ గలిగితే చాలు లక్షలు వెనకేసు కోవచ్చు. ఈ దేశంలో ఎందరో మహానుభావులు జన్మించారు. మరికొందరు ఋషులు, యోగులు, స్వాములుగా, మార్గ నిర్దేశకులుగా, జాతికి జీవం పోసేలా తమను తాము మల్చుకుంటున్నారు. 

ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో కొందరు న్యూమరాలజిస్టులు, ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష్కులు కేవలం సమాజ సేవకే తమ విలువైన కాలాన్ని, జీవితాన్ని వినియోగిస్తున్నారు. ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్న వారికీ మేలు జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. సాధన ద్వారా తాము నేర్చుకున్న మంచి అంశాలు, విషయాలను పామరులకు, సామాన్యులకు అందుబాటులో ఉండేలా చేస్తున్నారు. అలాంటి వారిలో హైదరాబాద్ సిటీలో ప్రముఖుడిగా వెలుగొందుతున్న అనంత కృష్ణ స్వామి ఒకరు. ఆయన అతి క్లిష్టమైన వాటికి అత్యంత సులభంగా సమాధానాలు ఇస్తారు. మనీ మంత్రా పేరుతో క్లాసులు నిర్వహిస్తున్నారు. జీవితంలో ఎలా సక్సెస్ సాధించాలి. ఎదురయ్యే సవాళ్ళను ఎలా అధిగమించాలి. డబ్బు ఎలా వస్తుంది. మనీ మన దగ్గరకు రావాలంటే, అది మనతో పాటీ ఉండాలంటే ఏం చెయ్యాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఏయే రెమెడీస్ పాటిస్తే ఎలాంటి పొజిషన్ లోకి మనం వెళ్లగలుగుతాం. ఇలాంటి ముఖ్యమైన ఎనర్జీని ఆయన మనకు బోధిస్తారు. ఆచరణలో పెట్టేలా చేస్తారు. అంతే కాకుండా కొన్ని మంత్రాలు కూడా మీకు ఉప దేశిస్తారు. మనల్ని మనీ సాధకులుగా ట్రైన్ చేస్తారు అనంత కృష్ణ స్వామి.డబ్బు అన్నది యూనివర్శల్ సబ్జెక్ట్ అంటారు స్వామి. ప్రతి దాంట్లో మనం నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉంటారు. దీనిని వదిలించు కోవాలి అంటారు. ఎప్పుడైతే కావాలని కోరుకుంటారో..మీలో మీరు కోరికతో రగిలి పోతారో ఇక మీలో మనీ ఎర్న్ సాధించాలన్న తపన మొదలవుతుంది. ఎలాంటి ఖర్చు లేకుండానే సుస్థిరమైన ఆదాయాన్ని సంపాదించే మార్గాన్ని చూపిస్తారు. అనంత కృష్ణ స్వామి అందుబాటులో ఉంటారు..వ్యక్తిగతంగా కలిస్తే మీకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!