ఖాకీల వేట..చిక్కని నిత్యానంద
వివాదాస్పద మత బోధకుడు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆశ్రమంలో బాలికలపై అత్యాచారం, కిడ్నాప్ ఆరోపణల నేపథ్యంలో స్వామి ఆశ్రమంలో పోలీసులు మరోసారి దాడులు నిర్వించారు. పలు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లోని నిత్యానంద ఆశ్రమాన్ని జిల్లా అధికారులు ఖాళీ చేయించారు. తన కుమార్తెలను అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. బాలికల అపహరణ, కిడ్నప్ లాంటి ఇతర క్రిమినల్ అభియోగాలు వచ్చిన నేపథ్యంలో స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. ల్యాప్‌టాప్, మొబైల్స్, ట్యాబ్స్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
దీంతో ఆశ్రమంలోని భక్తులంతా ఆశ్రమాన్ని వీడారు. అంతే కాదు స్వాధీనం చేసుకున్న డివైస్‌లలో మైనర్ పిల్లలపై శారీరక దాడి, వేధింపులు, తీవ్రంగా హింసిస్తున్న వీడియోలు, ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిత్యానంద తన కుమార్తెలను అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన జనార్ధన శర్మ గత నెలలో గుజరాత్ రాష్ట్ర పిల్లల రక్షణ పరిరక్షణ కమిషన్‌తో పాటు గుజరాత్ హైకోర్టును ఆశయించారు. పిల్లల్ని తీవ్రంగా హింసించారని ఆరోపించారు. అయితే పోలీసుల చొరవతో ఇద్దరు కుమార్తెలకు విముక్తి లభించగా, పెద్ద కుమార్తెలిద్దరు నిత్యానంద సంస్థను విడిచి పెట్టడానికి నిరాకరించారు. తన పిల్లలను ఆశ్రమంలో బ్రెయిన్ వాష్ చేసి హింసించారని శర్మ ఆరోపించారు.
అయితే వీరిని గుర్తించాల్సిందిగా గుజరాత్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అంతే కాదు ఇంటర్ పోల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇతర సంబంధిత అధికారులను కూడా సంప్రదించాలని హైకోర్టు సూచించింది. దీంతో కేసు నమోదు చేసిన గుజరాత్ పోలీసులు పరారీలో ఉన్న నిత్యానంద కోసం గాలిస్తున్నారు. కాగా అత్యాచారం కేసులో విచారణను తప్పించు కునేందుకు నిత్యానంద విదేశాలకు పారి పోయినట్టుగా భావిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నిత్యానంద పాస్‌పోర్ట్ గడువు 2018 సెప్టెంబర్‌లో ముగిసిందనీ, అత్యాచారం ఆరోపణల కారణంగా రెన్యువల్ చేయలేదనీ ప్రస్తుతం నిత్యానంద ఎక్కడ ఉన్నారో తెలియదని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అతి పెద్ద రక్షణ వ్యవస్థ కలిగిన కేంద్ర ప్రభుత్వానికి నిత్యానందను పట్టుకోలేక పోవడం విస్తు పోయేలా చేస్తోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి