పల్లెకు పోదాం చలో చలో
అన్ని కంపెనీలు పల్లెల బాట పడ్డాయి. అసలైన వ్యాపారం ఇక్కడే జరుగుతోంది. దీంతో నిన్నటి దాకా పట్టించుకోని పల్లెలు ఇప్పుడు కళకళ లాడుతున్నాయి. తాజాగా వెహికిల్స్ కోసం పల్లెవాసులు క్యూ కడుతున్నారు. విచిత్రం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక రియల్ ఎస్టేట్ దందా ఎక్కువై పోయింది. ప్రతి ఊరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అడ్డాగా మారి పోయింది. తాజాగా ఫోర్ వీలర్స్, టూ వీలర్స్ కు వాహనదారులు, కొనుగోలుదారులు ఎగబడుతున్నారు. సిటీ కల్చర్ గ్రామీణులపై పడుతోంది. ఈ ఏడాది వానలు కాస్త లేటయినా, లేటెస్ట్ గా సమృద్ధిగా కురిశాయి. ఆటోమొబైల్స్ కంపెనీలన్నీ పల్లె పాట పాడుతున్నాయి. గ్రామీణులను ఆకర్షించడానికి గ్రామ మహోత్సవాలను నిర్వహిస్తున్నాయి.
తక్కువ వడ్డీ రేట్లకు వాహన రుణాలిస్తున్నాయి. ఆకర్షణీయమైన ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను అందిస్తున్నాయి. సర్వీసింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఆర్థిక మందగమనం కారణంగా డిమాండ్ తగ్గి అమ్మకాలు కుదేలవడంతో వాహన కంపెనీలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వాహన విక్రయాలు గత ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దిగజారి పోయాయి. దీంతో మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్, మహీంద్రా, టయోటా తదితర వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్లలో అమ్మకాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడే సర్వీసింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ 3,000కు పైగా తాలుకాల్లో సేల్స్, సర్వీసింగ్ అవుట్‌లెట్‌లను అందుబాటు లోకి తెచ్చింది.
అమ్మకాలు పెంచు కోవడానికి టీచర్లు, గ్రామాల్లో కుల వృత్తులు చేసే వ్యక్తులపై దృష్టి పెట్టింది. కంపెనీలు గ్రామ మహోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఎక్సే్ఛంజ్ డీల్స్‌ను, తక్కువ వడ్డీరేట్ల ఫైనాన్స్ స్కీమ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. వర్షాలు బాగా పడడంతో పంటలు సమృద్ధిగా పండి ఆర్థిక వ్యవస్థ త్వరితంగా రికవరీ కాగలదన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్ బాట పడుతున్నాయి. భవిష్యత్తు గ్రామీణ మార్కెట్లదేనని రెనో ఇండియా చెబుతోంది. గ్రామీణ ప్రాంతాలే ముందుగా మంద గమన పరిస్థితులను అధిగ మిస్తాయని, ఆ తర్వాత పట్టణాలు పుంజు కుంటాయన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి