అజ్జూ ఋణం తీర్చుకున్న దాదా
రియల్లీ యూ ఆర్ గ్రేట్ దాదా. దమ్మున్నోడు. డైనమిక్ లీడర్. అంతే కాదు ఎవ్వరికీ జవాబుదారీ ఇవ్వాల్సిన పరిస్థితులు తీసుకు రాకుండానే తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు బెంగాల్ టైగర్ సౌరభ్ గంగూలీ. తనను నమ్ముకున్న వారికి, తనకు అవకాశం ఇచ్చిన వారికి సహాయం చేయడంలో నిమగ్నమై ఉన్నాడు ఈ తాజా ప్రెసిడెంట్. మహమ్మద్ అజహరుద్దీన్ అద్భుతమైన ఆటగాడు. అంతే కాదు ప్రముఖ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చెప్పినట్టు ఈ మాజీ ఆటగాడు ఈ దేశానికి దేవుడు ఇచ్చిన వరం. ఒకవేళ అనుకోని రీతిలో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులు ఇరుక్కోక పోయి ఉనింటే ఇవ్వాళ బిసిసిఐకి దిశా నిర్దేశనం చేసే స్థాయిలో ఉండేవాడు. ఈ హైదరాబాదీ పేరుతో ఎన్నో రికార్డులు నమోదు అయి ఉన్నాయి.
ఒకానొక దశలో ఇండియన్ క్రికెట్ జట్టులోకి అనూహ్యంగా వచ్చాడు. తక్కువ సమయంలోనే ఇండియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడు. బొంబాయి క్రికెటర్ల ఆధిపత్యానికి చెక్ పెట్టాడు. ప్రపంచం దోషిగా నిలబెట్టిన సమయంలో క్రికెట్ దిగ్గజాలు సిద్దు, కపిల్ దేవ్ , గంగూలీ తోడుగా ఉన్నారు. ఆయన వెనుకే నిలబడ్డారు. ఇప్పటికీ అజహరుద్దీన్ అంటే ఇండియాలోనే కాదు ప్రపంచంలో లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కు నూతన అధ్యక్షుడిగా ఎంపికైన దాదా క్రికెట్ కెరీర్ మన హైదరాబాదీ సారధిగా ఉన్న సమయంలోనే ప్రారంభమైంది. అంతే కాదు ప్రతి సందర్భంలోను గంగూలీని ప్రోత్సహించాడు. వెన్ను తట్టాడు. అన్ని అవకాశాలు కల్పించాడు అజహరుద్దీన్. అందుకే ప్రతి సందర్భంలోను దాదా అజ్జు భాయిని గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు.
తాను బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో తన కెప్టెన్ ను ఘనంగా సన్మానించారు. అంతే కాదు తాను బిసిసిఐ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టాక మరోసారి తన వెల్ విషర్ ను హత్తుకున్నాడు. ఘనంగా స్వాగతం పలికాడు. తాను ప్రేమించే అజహరుద్దీన్ తో సెల్ఫీ తీసుకున్నాడు. తొలి గులాబీ బంతితో కోల్ కొత్త లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో బిగ్ స్టార్స్ ను సన్మానించారు. ఎక్కువగా అజ్జు భాయిని అద్భుతంగా సత్కరించారు. తన పవర్ ఏమిటో గంగూలీ రుచి చూపిస్తున్నాడు. ఏకంగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అజహరుద్దీన్‌కు బాకీగా ఉన్న కోటీ 50 లక్షల రూపాయలను చెల్లించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ మొత్తాన్ని అజహర్‌కు ఇవ్వాలని బోర్డు ఏజీఎంలో నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించాడు.
బోర్డు నిబంధనల ప్రకారం మాజీ ఆటగాళ్లకు ఇవ్వాల్సిన పెన్షన్ తదితర సౌకర్యాలతో కలిపి అజ్జూకు కోటిన్నర రావాల్సి ఉంది. అయితే అతనిపై మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించిన నిషేధం కొనసాగు తుండటంతో బోర్డు వీటిని నిలిపి వేసింది. 2012లోనే ఏపీ హైకోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, తన బాకీలు చెల్లించాలంటూ రెండేళ్ల క్రితమే అజహర్ విజ్ఞప్తి చేశాడు. అయితే సీఓఏ మాత్రం స్పందించ లేదు. ఎట్టకేలకు ఇప్పుడు బోర్డు అధ్యక్షుడి హోదాలో గంగూలీ తన తొలి కెప్టెన్‌కు మేలు చేకూర్చేలా అధికారిక నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న అజహరుద్దీన్ ఇండియన్ క్రికెట్ జట్టు తరఫున 99 టెస్టులు, 334 వన్డేలు ఆడాడు. లెక్కలేనన్ని విజయాలు అందించాడు. ఎంతైనా తన గురువు రుణాన్ని ఈ సందర్బంగా దాదా తీర్చుకున్నాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి