ఎంత తిడితే అంత ఆనందం
ఇదేమిటి అనుకుంటున్నారా..అవును మీరు చూస్తున్నది కరెక్టే. తెలుగు, తమిళ్ సినిమా రంగాల్లో తన సంగీతంతో మెస్మరైజ్ చేస్తూ రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్. తనకు పొగడ్తల కంటే తిట్టే వారినే ఎక్కువగా ఇష్టపడతానని అంటున్నాడు. ప్రసంశలు ఉన్న చోటే విమర్శలు కూడా ఉంటాయి. విమర్శలను విశ్లేషించు కుంటూ ప్రతి రోజూ కొత్త విషయాలను నేర్చుకుంటూ కెరీర్లో ముందుకు సాగి పోవాలనుకుంటున్నాను అంటున్నారు తమన్. వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకీమామ’. ఇందులో పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా కథా నాయికలుగా నటించారు. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు తమన్ పలు విశేషాలు పంచుకున్నారు. వెంకీమామ ఒక ఎమోషనల్ ఫిల్మ్. ఈ సినిమా రఫ్ వెర్షన్ చూసి నేను కంట తడి పెట్టుకున్నాను. ఇందులోని ఎమోషన్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. మామా, అల్లుడా అన్నట్లు వెంకటేష్, నాగచైతన్య ఇద్దరూ పోటీ పడి నటించారు. ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా, సెకండాఫ్ ఎమోషనల్‌గా ఉంటుంది. వెంకటేష్‌గారి డ్యాన్స్ సినిమాలో హైలైట్. డైరెక్టర్ బాబీ బాగా తెరకెక్కించాడు. సరైనోడు సినిమా తర్వాత బ్రేక్ తీసుకుని బాగా రిలాక్స్ అయ్యాను. ఆ తర్వాత చేసిన మహానుభావుడు, భాగమతి, తొలిప్రేమ, ఛల్ మోహన్‌రంగ, అరవింద సమేత వీర రాఘవ సినిమాల పాటలకు మంచి పేరు వచ్చింది. నా పాటలకు మంచి స్పందన లభిస్తోందంటే అందుకు కారణం కథలు బాగుండటమే.
ఇక సోషల్ మీడియా కామెంట్స్‌ను ఎక్కువగా పట్టించు కుంటాను. ప్రతి ట్వీట్ ఓ ప్రెస్‌మీటే అన్నారు తమన్. ఓ నెటిజన్ వ్యతిరేకంగా ఓ ట్వీట్ పోస్ట్ చేశాడు. అంటే అతనెక్కడో బాధపడి ఉంటాడు. అది గమనించి నెక్ట్స్ టైమ్ అలా చేయకుండా ఉండాలను కుంటాను. అలా తిట్టేవారు కూడా కావాలి. ఎందుకంటే అమ్మ తిట్టక పోతే ఎలా బాగు పడతాం. ప్రస్తుతానికి రీమిక్స్ సాంగ్‌కు కాస్త దూరంగా ఉందామని అనుకుంటున్నాను. ఇప్పుడు సినిమాలోని ఆరు పాటలను ఒకేసారి కాకుండా విడివిడిగా విడుదల చేయడం మంచి పరిణామమే అని నా అభిప్రాయం. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి.
సావన్, రాగ.. ఇలా డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. అందువల్ల ఆడియన్స్‌కు మరింత చేరువ అయ్యే చాన్స్ ఉంటుంది అంటున్నారు ఈ మ్యూజిక్ డైరెక్టర్. వెంకీమామ ఫ్యామిలీ డ్రామా, అల.. వైకుంఠపురములో..ఫన్ అండ్ యాక్షన్ ఫిల్మ్, డిస్కో రాజా డిఫరెంట్ జానర్, ప్రతిరోజూ పండగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ఇలా భిన్న రకాల సినిమాలకు సంగీతం సమ కూర్చడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను అని చెబుతున్నారు తమన్. కాగా తాజాగా ఆలా వైకుంఠపురం మూవీ సినిమా పాటలు మాత్రం దుమ్ము రేపుతున్నాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి