ఆల్ఫాబెట్ సిఇఓగా పిచాయ్

ప్రపంచం లోనే దిగ్గజ సంస్థకు కార్య నిర్వహణ అధికారిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న భారతీయ సాంకేతిక మేధావి సుందర్ పిచాయ్ మరో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కీలకమైన ప్రకటన వెలువడింది కూడా. ఇప్పటికే గూగుల్ కంపెనీకి సిఇఓ గా ఉన్న అరుదైన, అద్భుతమైన ఈ వ్యక్తి ఏది చేసినా, ఏది మాట్లాడినా ఓ సంచలనమే. కొద్ది సేపట్లోనే అది వైరల్ గా మారుతుంది కూడా. ఇప్పటికే భారీ వేతనాన్ని అందుకుంటున్న సిఇఓలలో సుందర్ పిచాయ్ మొదటి ప్లేస్ లో ఉన్నారు. ఐటీ పరంగా గూగుల్ ను టాప్ రేంజ్ లో నిలబెట్టేందుకు, కొత్త టెక్నాలజీని అప్ డేట్ చేయడం. ఈ ప్రపంచం నివ్వెర పోయేలా ఆవిష్కరణలకు సాంకేతిక జోడించడంలో సుందర్ అందరి కంటే ముందంజలో ఉన్నారు.

నిత్యం ప్రపంచ అభివృద్ధి కోసం పరితపించే ఈ ఇండియన్ టెక్కీ దిగ్గజం తన చరిత్రను తానే అధిగమిస్తున్నాడు. ఇది కూడా ఓ రికార్డు గానే భావించాలి. గూగుల్ లో సిఇఓ గా చేరక ముందు సుందర్ పిచాయ్ ఆల్ఫా బెట్ ఐటీ కంపెనీలో విధులు చేపట్టాడు. తాజాగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాంకేతిక రంగంలో ఐటీ పరంగా గూగుల్ సంస్థకు దరిదాపుల్లో కంపెనీలు లేక పోయినా భవిష్యత్తులో ఏ కంపెనీ తమను దాటి వేళ్ళ కూడదనే రీతిలో వర్క్ చేస్తున్నారు సుందర్. మొహ మాటస్థుడైన ఈ చెన్నై దిగ్గజం ఏది చేసినా అది సెన్సేషన్ కావాల్సిందే. ప్రస్తుతం సుందర్‌ పిచాయ్‌ మరో అత్యున్నత బాధ్యతలను చేపట్టారు.

గూగుల్‌ వ్యవస్ధాపకులు లారీ పేజ్‌, సెర్జీ బ్రిన్‌ మాతృసంస్థ అల్ఫా బెట్‌ నుంచి వైదొలగడంతో ఆ కంపెనీ సీఈఓగా సుందర్‌ పిచాయ్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. 21 సంవత్సరాల కిందట గూగుల్‌ మాతృ సంస్థ అల్ఫా బెట్‌ను స్ధాపించిన పేజ్‌, బ్రిన్‌లు కంపెనీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. సుదీర్ఘ కాలంగా కంపెనీ రోజు వారీ నిర్వహణ కార్యకలాపాల్లో తలమునకలైన తాము ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నామని, సంస్థకు తమ సలహాలు సూచనలు అందిస్తామని పేజ్‌, బ్రిన్‌లు బ్లాగ్‌లో పోస్ట్‌ చేశారు.

వెబ్‌ సెర్చింగ్‌, ఇతర టాస్క్‌లను వేగవంతం చేసేందుకు కృత్రిమ మేథ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధిపై జరుగుతున్న కసరత్తును ఇక సుందర్‌ పిచాయ్‌ మున్ముందుకు తీసుకు వెళ్లనున్నారు. మేనేజ్‌మెంట్‌లో ప్రక్షాళన నేపథ్యంలో సవాళ్లను ఎదుర్కొని లాభాలపై దృష్టి సారించేందుకు అల్ఫాబెట్‌కు ఇది మంచి అవకాశమని ఇన్వెస్టర్లు అభిప్రాయ పడుతున్నారు. మొత్తం మీద సుందర్ పిచాయ్ రెండు సంస్థల బాధ్యతలు మోయాల్సి వస్తుందన్నమాట. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!