పెద్ద ఎత్తున ఉద్యోగుల ఇంటిబాట
కొన్నేళ్లుగా దేశానికి విశిష్టమైన రీతిలో సేవలు అందించిన భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ ఇప్పుడు దివాళా అంచున నిలబడింది. దేశ వ్యాప్తంగా కోట్లాది రూపాయల విలువ చేసే స్వంత స్థలాలు ఈ టెలికాం సంస్థకు ఉన్నాయి. అందుకేనేమో మోడీ కంపెనీ ఉద్దీపన పేరుతో అమ్మకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఆసరా కోసం అర్రులు చాస్తున్నాయి. ఇక బ్యాంకుల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే పేదలు, సామాన్యులు కస్టపడి దాచుకున్న డబ్బులన్నీ వ్యాపారులు, బడాబాబులు, కార్పొరేట్ కంపెనీలు, వ్యాపారవేత్తలు, బిజినెస్ టైకూన్స్ జేబుల్లోకి వెళ్లి పోయాయి. దీంతో అన్ని ప్రభుత్వ బ్యాంకులు నేల చూపులు చూస్తున్నాయి.
నోట్ల రద్దు తర్వాత జరిగిన పరిణామాలలో ఎక్కువగా నష్ట పోయింది మాత్రం కోట్లాది సామాన్య ప్రజలు మాత్రమే. జాతీయ స్థాయి ఆర్ధిక వృద్ధి రేటు కూడా మందగమనంలో సాగుతోంది. దీంతో భారతీయ ఆర్ధిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ప్రధాని, విత్త, హోమ్ శాఖా మంత్రులతో కలిసి అత్యవసర సమావేశం చేపట్టారు. అయినా మార్పు మాత్రం రాలేదు. ఇంకో వైపు బ్లాక్ మనీని అరికడతామని, విదేశాల్లో దాచుకున్న దొంగల భరతం పడతానని బీరాలు పలికిన మోడీ ఇప్పటి వరకు ఒక్కరిని కూడా పట్టుకోలేక పోయారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థల విషయానికి వస్తే నిరుద్యోగం పెచ్చరిల్లుతోంది. నోట్ల రద్దు ఎఫెక్ట్ ప్రతి రంగాన్ని అతలాకుతలం చేసింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా బాధ్యతల నుంచి తప్పుకునేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే దేశమంతటా ఒకే పన్నుల విధానాన్ని అమలు లోకి తీసుకు వచ్చింది. అయినా మార్పు రాలేదు. ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు ఇప్పుడు కోలుకోలేని స్థితికి చేరుకున్నాయి. దీంతో భారంగా మారిన ఉద్యోగులను ఇంటికి పంపించాలని డిసైడ్ అయ్యింది. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ ప్రవేశ పెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకం ముగిసింది. రెండు సంస్థల్లో 92,700 మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో 78,300 మంది, ఎంటీఎన్‌ఎల్‌లో 14,378 మంది దీన్ని ఎంచుకున్నారు.
ఊహించిన స్థాయిలోనే ఇది ఉంది. సుమారు 82,000 మేర సిబ్బంది సంఖ్య తగ్గుతుందని భావించారు. 78,300 మంది వీఆర్‌ఎస్ ఎంచుకోగా, మరో 6,000 మంది రిటైరయ్యారు. మరోవైపు ఎంటీఎన్‌ఎల్ లో 14,378 మంది వీఆర్‌ఎస్ ఎంచుకున్నారు. దీంతో రెండు సంస్థల వేతన భారం 8,800 కోట్ల మేర తగ్గనుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో వేతన పరిమాణం 14,000 కోట్ల నుంచి 7,000 కోట్లకు దిగి వస్తుండగా, ఎంటీఎన్‌ఎల్ వేతన భారం 2,272 కోట్ల నుంచి 500 కోట్లకు తగ్గుతుంది. మొత్తం మీద స్వచ్చంద పదవీ విరమణ పథకం ఉద్యోగులకు మేలు జరుగుతుందనే భావించాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి