జగన్ కు లాయర్ల జేజేలు

విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా, తాను మాత్రం మడమ తిప్పేది లేదంటూ ముందుకే సాగిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి. పేదల సంక్షేమమే తన ధ్యేయమంటూ వందలాది కార్యక్రమాలు, జనం కోసం విన్నూతమైన రీతిలో పథకాలు ప్రవేశ పెడుతున్నారు. తనదైన శైలిలో పాలనను గాడిలో పెడుతూనే అధికారులు, మంత్రివర్గాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ సహాయం అంద జేస్తామని ఎన్నికల ప్రచారం చేపట్టిన సందర్భంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు  ‘వైఎస్సార్‌ లా నేస్తం’ పథకాన్ని జగన్‌ ప్రారంభించారు. లబ్ధిదారులైన న్యాయవాదుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేశారు.

ఈ పథకం కింద జూనియర్‌ న్యాయ వాదులకు ప్రతినెలా 5,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రాక్టీస్‌ పిరియడ్‌లో మూడేళ్ల పాటు అందించనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ న్యాయవాదులకు ప్రతినెలా 5,000 చొప్పున స్టైఫండ్‌ ఇవ్వడం పట్ల పలువురు న్యాయవాదులు జగన్ మోహన్ రెడ్డికి జేజేలు పలుకుతున్నారు. సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమ నిధికి 100 కోట్ల నిధులు మంజూరు చేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం న్యాయవాదుల చట్టంలో మార్పులు తీసుకొస్తుండడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

కాగా వైఎస్సార్‌ లా నేస్తం పథకానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసింది ప్రభుత్వం. జీవో జారీ చేసిన నాటికి 35 ఏళ్ల లోపు వయసున్న, బార్‌ కౌన్సిల్‌ రోల్స్‌లో నమోదైన జూనియర్‌ న్యాయవాదులు 2016, ఆ తర్వాత ఉత్తీర్ణులైన లా గ్రాడ్యుయేట్లు ఈ పథకానికి అర్హులవుతారని స్పష్టం చేసింది. కాగా తాజాగా జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన వైఎస్సార్ లా నేస్తం కింద 1970 మంది జూనియర్ అడ్వొకేట్స్ లబ్ది పొందుతున్నారు. ఈ మేరకు నవంబర్‌ నెలకు గాను చెల్లించాల్సిన స్టైఫండ్‌ 98.50 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. స్టైఫండ్‌ చెల్లించేందుకు 5.30 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలాంటి పథకం పథకం ప్రవేశ పెట్టడం దేశంలో ఇదే మొదటిది కావడం ఓ విశేషం. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!