యువరాజుతో కరచాలనం చిన్నారి ఆనందం

సోషల్ మీడియా పుణ్యమా అంటూ కొందరు అనామకులు ఒక్క రోజులోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. రికార్డుల మోత మోగిస్తున్నారు. కొద్ది నిమిషాల్లోపే ప్రపంచమంతటా పాపులర్ అయి పోతున్నారు. తాజాగా అబుదాబిలో జరిగిన సంఘటన ఓ చిన్నారిని హైలెట్ గా మార్చేసింది. అదేమిటంటే అబుదాబి యువరాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ కొద్ది రోజుల కిందట ఓ విందులో పాల్గొన్నారు. ఈ విషయం తెలిసిన స్థానిక ప్రజలు అతనితో కరచాలనం  చేసేందు కోసం పెద్ద ఎత్తున బారులు తీరారు. ఇంతలో ఓ చిన్నారి పరుగు పరుగున వచ్చి ఆ లైన్‌లో నిలబడింది. ఆ యువరాజ వారి కోసం చేతులు ముందుకు చాచి ఆతృతగా ఎదురు చూడ సాగింది.

అందరికీ చిరునవ్వుతో కరచాలనం చేస్తూ వచ్చిన యువరాజు చివరకు ఆ చిన్నారికి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వ కుండానే వెళ్లి పోయాడు. దీంతో ఆ చిన్నారి హృదయం తీవ్రంగా గాయపడింది. తన వంతు రాగానే యువరాజు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వ లేదని ఎంతగానో బాధ పడింది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ప్రపంచమంతటా చర్చనీయాంశం కావటంతో వెంటనే ఆ యువరాజు చిన్నారి ఐశా మహమ్మద్‌ మషీత్‌ అల్‌ మజ్‌రౌవీ ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబ సభ్యులను సందర్శించి సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు.

చిన్నారితో కరచాలనం చేయడమే కాకుండా నుదుటిపై ఆత్మీయంగా ముద్దు పెట్టాడు. దీంతో బాలిక ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యువరాజుది గొప్ప మనసు అంటూ ఆయన చేసిన పనికి నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు. ఇప్పుడు యువరాజుతో పాటు ఈ చిన్నారి ఒక్క రోజులోనే పాపులర్ అయిపొయింది. ఏదైనా అదృష్టం కలిసి రావాలి కదూ అంటున్నారు నెటిజన్లు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!