ధనా ధన్..జన్ ధన్ - భారీగా నగదు జమ

ఎవరన్నారు జనం దగ్గర డబ్బులు లేవని. ఈ దేశం వంద కోట్లకు పైగా జనాభా వుండడంతో ప్రతి ఒక్కరు కేవలం ఒకే ఒక్క రూపాయి చొప్పున జమ చేస్తే చాలు..110 కోట్లకు పైగా జమ అవుతుంది. ఇది కూడా ఓ రికార్డే. ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో భారీ ఎత్తున వ్యక్తిగత, ఉమ్మడి, కరెంట్ ఖాతాలు నమోదయ్యాయి. అంతేకాకుండా లాకర్లలో బంగారం, వెండి, వజ్రాలు జమ చేశారు ఇండియన్స్. వీరితో పాటు ప్రవాస భారతీయులు కూడా ప్రత్యేకంగా తమ వారి కోసం డాలర్లు పంపిస్తున్నారు. అవి కూడా వారి ఖాతాల్లో మూలుగుతున్నాయి. దీనిని గమనించిన ప్రధాని మోడీ అధికారంలోకి రాగానే వాటిపై కన్నేశారు. ఏకంగా మీరు జమ చేయండి..మేము మీకు అంతే మొత్తంలో జమ చేయడంతో భారీగా జన్ ధన్ ఖాతాలలోకి వెల్లువలా డబ్బులు వచ్చి పడ్డాయి. పీఎం పిలుపుతో లక్షలాది మంది జనం బయటకు వచ్చారు. తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బులను జమ చేస్తూ పోయారు. రికార్డు స్థాయిలో లక్ష కోట్లకు చేరువల్లో డిపాజిట్లు జమ కావడంతో అటు బ్యాంకులు, ఇటు వాటిని నియంత్రిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశ్చర్యానికి లోనైంది. 2014లో మొదటి సారిగా ...