దశల వారీగా ఎన్నికలు - ఆశావహుల్లో అభ్యర్థులు
తెలంగాణలో పాలన పూర్తిగా స్తంభించి పోయింది. ఒకటి తర్వాత మరొకటి ఎన్నికలు వచ్చి పడుతున్నాయి. జనానికి పాలు పోవడం లేదు. రాష్ట్రంలో ఏం జరుగుతోందనన్న ఆందోళన మొదలైంది. గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగిశాయి. తాగేందుకు నీళ్లు దొరకక పోయినా..సాగు, తాగు నీరందక పోయినా..ప్రతి ఊరులో మద్యం దొరుకుతోంది. బీర్లు, బార్లు బార్లా తెరిచే ఉంచుతున్నారు. ప్రజలంతా ఇపుడు భేదాలు మరిచారు..విభేదాలు పక్కన పెట్టారు. అంతా ఒకే చోట కూర్చుని తాగుతున్నారు. నీళ్లు లేక పోయినా ఉండగలరేమో కానీ లేచినప్పటి నుంచి పడుకునే దాకా తాగకుండా ఉండలేక పోతున్నారు. అంతేనా డీజేలు, పాటలతో హోరెత్తిస్తున్నారు. గత పది నెలల నుంచి ప్రతి ఒక్కరు ఏదో ఒక రాజకీయ పార్టీ గురించి చర్చిస్తున్నారు. రాజకీయం అంటే గులాబీ బాస్ ను చూసి నేర్చుకోవాల్సిందే. అసలు ప్రతిపక్షం అంటూ లేకుండా చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు విపక్షాలు విలవిలలాడి పోతున్నాయి. ఎవరు ఏ పార్టీ వైపు ఉన్నారో తెలియక ప్రజలు తలలు బాదుకుంటున్నారు.
నిన్న పంచాయతీ లొల్లి పూర్తయితే..అసెంబ్లీ ఎన్నికలు ముగిసినవి. కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యిండు. పార్లమెంట్ ఎన్నికలు కూడా పూర్తయినవి. కేంద్రంలో ఎవడొస్తడో మనకెందుకు ..ముందు 16 సీట్లు గెలవాలె..ఢిల్లీలో చక్రం తిప్పాలే. కేసీఆర్ పీఎం కావాలె అనే ముచ్చటనే ఎక్కడ చూసినా వినిపిస్తోంది. ఎప్పటి లాగానే ట్రబుల్ షూటర్‌గా పేరొందిన హరీష్ రావు ఇపుడు గమ్మున్నడు. కొడుకు కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడయ్యాక..అన్ని బాధ్యతలు తానే భుజాన వేసుకుని పార్టీని ముందుకు తోలుతున్నడు. ప్రతి ఒక్కరు ఆయన జపమే చేస్తున్నారు. నా చేతుల్లో ఏమీ లేదు..ముందు కార్యకర్తలు ప్రజల మధ్యనే ఉండాలి. వారి సమస్యలు పరిష్కరించాలని పిలుపునిస్తున్నడు. ఇపుడు మళ్ల ఎన్నికల జ్వరం పట్టుకుంది జనానికి . ఊకుండలేక ఉరుకులు పరుగులు పెట్టిస్తుండి కేసీఆర్. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడు విడతల్లో నిర్వహించేందుకు రెడీగా ఉన్నామని కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. మే 6, 10, 14 తేదీల్లో పోలింగ్ జరిపేందుకు నిర్ణయించారు. అదే నెల 27న ఫలితాలు వెల్లడిస్తారు.
తొలిదశలో 22న నోటిఫికేషన్ విడుదలవుతుంది. మే 6న 2, 166 ఎంపీటీసీ సీట్లకు, 197 జెడ్పీటీసీ సీట్లకు ఎన్నిక జరుగుతుంది. రెండో దశలో ఏప్రిల్ 26న నోటిఫికేషన్ జారీ చేస్తారు. మే 10న ఎన్నికలు జరుగుతాయి. 1913 ఎంపీటీసీ, 180 సీట్లకు పోలింగ్ జరుగుతుంది. మూడో దశలో ఏప్రిల్ 30న నోటిఫికేషన్ విడుదలవుతుంది..మే 14న 1736 ఎంపీటీసీ సీట్లకు 161 జెడ్పీటీసీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీలో జెడ్పీ ఛైర్మన్‌ల పదవుల కోసం పోటీ పెరిగింది. ఎవరికి ఛాన్స్ దక్కుతుందోనని తెగ ఆరాట పడుతున్నారు గులాబీ తమ్ముళ్లు. వీటిని కూడా పెద్దాయన కేసీఆరే నిర్ణయించాల్సి ఉంటుంది. వీరిని ఎంపిక చేయడం..వారిని గెలిపించడం..అంతా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు..ఆయా జిల్లాల కు బాధ్యత వహిస్తున్న సంబంధిత మంత్రులే నిర్ణయిస్తారు. కనీసం పార్టీ అధ్యక్షుడు కూడా ఉండరు.
పరిషత్ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 1, 56, 11 , 474 మంది ఉండగా 76 లక్షల 76 వేల 361 మంది మహిళలు, 77 లక్షల 34 వేల 800 మంది పురుషులు, 313 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. 2 వేల 879 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, 32 వేల 042 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. లక్షా 47 వేల మంది పోలింగ్ సిబ్బంది ఇందులో పాలు పంచుకుంటున్నారు. 54 వేల మంది భద్రతా సిబ్బంది పర్యవేక్షించనున్నారు. లక్షా 18 వేల 154 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల పరిశీలకులు 15 మంది, ఎన్నికల వ్యయ పరిశీలకులు 37 మందిని నియమించారు. లోకల్ పంచాయతీ షురూ కావడంతో ఆయా పార్టీలకు చెందిన వారంతా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎంత ఖర్చయినా సరే..పెట్టేందుకు వెనుకాడటం లేదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి