దుమ్ము రేపిన సన్‌రైజర్స్ - ఓటమి పాలైన కోల్‌కతా
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయిన ఈ జట్టు 9 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును మట్టికరిపించింది. టాస్ గెలిచి కోల్‌కతా జట్టుకు బ్యాటింగ్ చేసే అవకాశాన్ని కల్పించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి కోల్‌కతా 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ జట్టులోని బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుండడంతో మ్యాచ్ రసవత్తరంగా ..ఉత్కంఠ భరితంగా సాగుతుందని ఇరు జట్ల అభిమానులు ఆశించారు. వారి అంచనాలు తలకిందులయ్యాయి.
టోర్నీలో బలమైన జట్లుగా ఇరు జట్లకు పేరుంది. కానీ ఏ కోశాన ప్రదర్శన జరగలేదు. బెయిర్ స్టో కేవలం 43 బంతులు మాత్రమే ఆడాడు. అంతేకాదు కళ్లు చెదిరే షాట్లను బాదాడు. ఏడు ఫోర్లు ..నాలుగు బ్యూటిఫుల్ సిక్సర్లను సాధించాడు. ఎలాంటి వత్తిడి అంటూ లేకుండా సునాయసంగా బ్యాట్ ఝులిపించాడు. స్టోకు తోడుగా మరో వైపు డేవిడ్ వార్నర్ రెచ్చి పోయాడు. బౌలర్లకు చుక్కలు చూపించాడు. 38 బంతులు మాత్రమే ఆడిన ఈ క్రికెటర్ మూడు ఫోర్లు, ఐదు భారీ సిక్సర్లతో చెలరేగి పోయాడు. ఒకానొక దశలో కొట్టిన సిక్సర్ జనాన్ని బాగా ఆకట్టుకుంది. అది మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. ఇద్దరూ ఆఫ్ సెంచరీలు చేయడంతో సన్ రైజర్స్ జట్టు విజయం సాధించింది. చివరలో వార్నర్ అవుట్ అయినా..బెయిర్ స్టో..విలియమ్సన్ లు లాంఛనాన్ని పూర్తి చేశారు.
హైదరాబాద్‌కు చెందిన సన్‌రైజర్స్ జట్టు ఆడుతుండడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు ఇక్కడి క్రికెట్ ఫ్యాన్స్. వారి అంచనాలకు మించి సన్ రైజర్స్ ఇవాళ ఆటతీరును ప్రదర్శించింది. టాస్ ఓడి రంగంలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో ఓపెనర్స్ క్రిస్ లిన్ అద్భుతంగా ఆడాడు. 51 పరుగులు చేసి జట్టు స్కోర్ పెంచేందుకు దోహద పడ్డాడు. వచ్చీ రాగానే ఓపెనర్‌గా ఉన్న సరైన్ దుమ్ము రేపాడు. బ్యాట్‌ను ఝులిపించాడు. 25 పరుగులు చేశాడు. రింకూ సింగ్ 30 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోర్ వచ్చింది. రసెల్ చివర్లో రెండు సిక్సులు బాదినా స్కోర్ పెరగలేదు. పోటీ ఇస్తుందనుకున్న కోల్‌కతా ఇలా పేలవంగా ఆడడంపై ఆ జట్టు అభిమానులు నిరాశకు లోనవగా..హైదరాబాద్ జట్టు ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి