ఆరోపణలు అవాస్తవం..విచారణకు సిద్ధం

ప్రజా వేగుల పేరుతో చేసిన ఫిర్యాదులు అత్యంత అవమానకరమైనవిగా ఉన్నాయని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ఏర్పాటు చేసినప్పటి నుంచి నేటి దాకా నియమ నిబంధనలకు లోబడే కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అంతా పని చేస్తున్నారని చెప్పారు. ఎప్పుడూ లెక్కలు తప్పలేదన్నారు. స్వయంగా దేవుడే వచ్చి చెప్పినా సరే తాము తప్పుడు లెక్కలు రాయబోమని ఐటీ దిగ్గజం స్పష్టం చేశారు. టాప్ మేనేజ్‌మెంట్ అనైతిక విధానాలకు పాల్పడు తోందంటూ ప్రజా వేగులు ఆరోపణలు చేయడం భావ్యం కాదన్నారు. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న విచారణపై తమ అభిప్రాయాలు రుద్దే ప్రసక్తి లేదని ఇన్వెస్టర్లతో సమావేశంలో నీలేకని చెప్పారు. మరోవైపు, ఫిర్యాదుల వెనుక సహ వ్యవస్థాపకులు, కొందరు మాజీ ఉద్యోగుల హస్తం ఉందంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన ఖండించారు. ఇవి హేయమైన ఆరోపణలని, వ్యవస్థాపకుల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలని వ్యాఖ్యానించారు. భారీ ఆదాయాలు చూపేందుకు సీఈవో సలిల్ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ అనైతిక విధానాలకు పాల్పడు తున్నారంటూ ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో నీలేకని చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంత...