లక్ష్మీ పార్వతికి కీలక పోస్ట్

తాను మాటల సీఎం ను కాదని, చేతల మనిషినని చేసి చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి. తాను పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచీ, తనకు అండగా ఉంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి సముచితమైన రీతిలో బాధ్యతలు అప్పగిస్తున్నారు. రాబోయే కాలంలో మరో అయిదేళ్ల పాటు ఏపీలో వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చేలా ఇప్పటి నుంచే ఓ ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వెళుతున్నారు. మరో వైపు విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా తాను మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయకుండానే పాలనను గాడిలో పెట్టే పనిలో పడ్డారు ఈ యువ నేత.

తన గెలుపు కోసం కష్టపడిన ఎమ్మెల్యే రోజా, ప్రముఖ హాస్య నటులు ఆలీ, పృథ్వీ రాజ్ లకు కీలక పదవులు కట్టబెట్టారు. వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లక్ష్మి పార్వతి కి కీలక పదవి అప్పగించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆమెను ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.1962, ఆగష్టు 10 న జన్మించింది. సాహిత్యంలో ఆమెకు మంచి పట్టుంది. తన భర్త వీరగంధం సుబ్బారావుతో కలిసి 1985లో ఎన్టీ రామారావు జీవిత చరిత్ర రాసే ఉద్దేశముతో ఆయన్ను కలుసుకున్నది. రామారావు నుండి జీవిత చరిత్ర రాసేందుకు అనుమతి సంపాదించి, ఇంట్లోనే నివసించే అవకాశాన్ని పొందింది. ఆయనతో సన్నిహితమై 1993లో వివాహం చేసుకున్నది.

మొదటి భర్త నుండి 1993 ఏప్రిల్ 15న విడాకులు తీసుకున్నది.1993, సెప్టెంబరు 11న తిరుపతిలో సంప్రదాయ బద్ధంగా వీరి వివాహం జరిగింది. ఎన్టీ రామారావు మరణానంతరము ఎదురులేని మనిషి అన్న పేరుతో 2004లో విడుదల చేసింది. 1996 అక్టోబరులో జరిగిన ఉప ఎన్నికలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్ఠీఆర్ సీఎం గా ఉన్న సమయంలో ఆమె తన హవా చెలాయించారు. ఆ తర్వాత కనుమరుగయ్యారు. వైసీపీలో చేరి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆమెకు జగన్ సముచిత స్థానం కల్పించారు.

కామెంట్‌లు