మళ్ళీ అల్లిపురంకే అవకాశం


ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన అల్లిపురం వేంకటేశ్వర రెడ్డికి మరో సారి అదృష్టం వరించింది. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మన్‌గా వెంకటేశ్వర్‌ రెడ్డి కొనసాగ నున్నారు. ఎల్బీ స్టేడియం లోని తన చాంబర్‌లో   రెండో సారి చైర్మన్‌గా అల్లిపురం పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర విభజన అనంతరం శాట్స్‌ తొలి చైర్మన్‌గా పీఠమెక్కిన ఆయన ఇటీవలే తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. రెడ్డిది ఉమ్మడి పాలమూరు జిల్లా.

మొదటి నుంచి వెంకటేశ్వర్ రెడ్డికి క్రికెట్ అంటే ప్రాణం. జిల్లాలో ఈ మాత్రం క్రికెట్ ఆటకు జనాదరణ ఉందంటే అది ఆయన చలవ వల్లనే. చిన్నారులు, యువతీ యువకులు ఎందరినో వెలుగులోకి తీసుకు వచ్చారు. 30 ఏళ్లకు పైగా క్రికెట్ కోసం ఎనలేని కృషి చేశాడు. ఓ వైపు డెవలప్ మెంట్ ఆఫీసర్ గా పని చేస్తూనే క్రికెట్ ను శ్వాసగా మార్చుకున్నాడు. లెక్క లేనన్ని క్రికెట్ టోర్నమెంట్స్ చేపట్టాడు. ఆయనను అంతా క్రికెట్ వెంకట్ అని పిలుస్తారు. అధికార పార్టీలో కీలక పాత్ర పోషించారు. అయన కేసీఆర్ కు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారు.

శాట్స్ చైర్మన్ పదవి కోసం బలమైన పోటీ ఏర్పడినా సీఎం అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డికే పగ్గాలు అప్పగించారు. ఆయన పదవి లోకి వచ్చాక గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. రెండో దఫా కూడా పగ్గాలు ఆయన చేతికే దక్కడం విశేషం. ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు తాను సైతం శాయ శక్తులా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాట్స్‌ ఎండీ దినకర్‌ బాబు, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, అంతర్జాతీయ బాక్సర్‌ నిజాముద్దీన్, జిమ్నాస్ట్‌ అరుణా రెడ్డి పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!