ఆరోపణలు అవాస్తవం..విచారణకు సిద్ధం

ప్రజా వేగుల పేరుతో చేసిన ఫిర్యాదులు అత్యంత అవమానకరమైనవిగా ఉన్నాయని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ఏర్పాటు చేసినప్పటి నుంచి నేటి దాకా నియమ నిబంధనలకు లోబడే కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అంతా పని చేస్తున్నారని చెప్పారు. ఎప్పుడూ లెక్కలు తప్పలేదన్నారు. స్వయంగా దేవుడే వచ్చి చెప్పినా సరే తాము తప్పుడు లెక్కలు రాయబోమని ఐటీ దిగ్గజం స్పష్టం చేశారు. టాప్‌ మేనేజ్‌మెంట్‌ అనైతిక విధానాలకు పాల్పడు తోందంటూ ప్రజా వేగులు ఆరోపణలు చేయడం భావ్యం కాదన్నారు.

అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న విచారణపై తమ అభిప్రాయాలు రుద్దే ప్రసక్తి లేదని ఇన్వెస్టర్లతో సమావేశంలో నీలేకని చెప్పారు. మరోవైపు, ఫిర్యాదుల వెనుక సహ వ్యవస్థాపకులు, కొందరు మాజీ ఉద్యోగుల హస్తం ఉందంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన ఖండించారు. ఇవి హేయమైన ఆరోపణలని, వ్యవస్థాపకుల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలని వ్యాఖ్యానించారు. భారీ ఆదాయాలు చూపేందుకు సీఈవో సలిల్‌ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్‌ రాయ్‌ అనైతిక విధానాలకు పాల్పడు తున్నారంటూ ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో నీలేకని చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించు కున్నాయి.

ఈ వదంతులు హేయమైనవి. అంతా ఎంత గానో గౌరవించే వ్యక్తుల ప్రతిష్టను మస కబార్చే లక్ష్యంతో చేస్తున్నవి. సంస్థకు జీవితాంతం సేవలు అందించిన మా సహ వ్యవస్థాపకులంటే నాకెంతో గౌరవం. వారు కంపెనీ వృద్ధి కోసం నిస్వార్థంగా కృషి చేశారు. భవిష్యత్‌లోనూ కంపెనీ శ్రేయస్సు కోసం పాటు పడేందుకు కట్టుబడి ఉన్నారు అని ఆయన తెలిపారు. టాప్‌ మేనేజ్‌మెంట్‌పై వచ్చిన ఆరోపణల మీద ఇప్పటికే స్వతంత్ర న్యాయ సేవల సంస్థ విచారణ జరుపుతోందని, ఫలితాలు వచ్చాక అందరికీ తెలియ జేస్తామని నీలేకని వెల్లడించారు. 

ప్రజా వేగుల ఫిర్యాదులకు సంబంధించి నిర్దిష్ట వివరాలివ్వాలని నేషనల్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ అథారిటీ  , కర్ణాటకలోని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కోరినట్లు ఇన్ఫీ తెలిపింది. ఎక్స్ఛేంజీ, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు కూడా మరింత సమాచారం అడిగినట్లు పేర్కొంది. అడిగిన వివరాలన్నింటిని సమర్పించనున్నట్లు ఇన్ఫీ వివరించింది. ప్రజావేగుల ఫిర్యాదులపై ఇన్ఫోసిస్‌ అంతర్గతంగా విచారణ జరుపుతోంది. అటు అమెరికన్‌ ఇన్వెస్టర్ల తరఫున అమెరికాలో క్లాస్‌ యాక్షన్‌ దావా వేస్తామంటూ న్యాయ సేవల సంస్థ ప్రకటించింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!