రిస్క్ తోనే ఇన్వెస్ట్ చేశా

టాటా గ్రూప్ ఆఫ్ కంపీనీస్ చైర్మన్ రతన్ టాటా చేసిన కామెంట్స్ సంచలనం కలిగించింది. ఆస్తులు, డబ్బులు ఎన్ని ఉన్నా పెట్టుబడి పెట్టాలనే రూల్ ఏమీ లేదన్నారు. ఒక స్థాయికి వచ్చాక ప్రతిదీ రిస్క్ తో కూడుకుని ఉంటుందన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో స్టార్ట్ అప్ లలో పెట్టుబడులు పెట్టానని టాటా చెప్పారు. నేను మొదట్లో వీటి పట్ల కొంత దూరంగా ఉన్నా. అనుకోకుండా స్టార్టప్‌ ఇన్వెస్టరుగా మారానని తెలిపారు. టాటా గ్రూప్‌లో కీలక హోదాలో ఉన్నప్పుడు స్టార్టప్‌ సంస్థల పట్ల చాలా ఆసక్తి కరంగా అనిపించేది. అయితే వాటిని కాస్త అంటరానివి గానే చూసే వాణ్ని.

ఎందుకంటే ఏదో ఒకటి, ఎక్కడో ఒక చోట టాటా గ్రూప్‌నకు ప్రయోజనాల వైరుధ్యం ఉండేదన్నారు. అయితే చైర్మన్ గా రిటైర్ అయ్యాక ఫ్రీడమ్ లభించింది. దీంతో ఆసక్తికరంగా అనిపించిన సంస్థల్లో నా సొంత డబ్బును కొద్దీ కొద్దిగా ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభించానని చెప్పారు. గతంలో కంటే ఎక్కువ రిస్కు తీసుకున్నా అన్నారు. పెట్టుబడులు పెడుతున్నా కదా అని నా దగ్గర బోలెడంత డబ్బు ఉందని అనుకోవద్దు అని రతన్‌ టాటా చెప్పుకొచ్చారు.

స్టార్టప్స్‌ ప్రమోటర్లలో కసి, వినూత్న ఐడియాలు, అవి అందించే పరిష్కార మార్గాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇన్వెస్ట్‌ చేస్తానని వెల్లడించారు. ఓలా, పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్, క్యూర్‌ ఫిట్, కార్‌ దేఖో, అర్బన్‌ ల్యాడర్, లెన్స్‌ కార్ట్‌ వంటి స్టార్టప్స్‌లో రతన్‌ టాటా వ్యక్తిగత హోదాలో ఇన్వెస్ట్ చేశారు. టాటా ఎక్కడ టాలెంట్ ఉంటుందో అక్కడ వాలి పోతున్నారు. నమ్మకానికి, నాణ్యతకు కేరాఫ్ గా మార్చేశారు టాటా కంపెనీని. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!