వెంటాడే జ్ఞాపకం..అల్లుకున్న పాటల పరిమళం..!

ఎన్ని సార్లు విన్నా అదే గొంతు మళ్ళీ మళ్ళీ వెంటాడుతూ ...మనసును తరుముతోంది. మల్లెలా ..గులాబీలా..గూడు కట్టుకున్న గుండెలోకి కిషోర్ గాత్రం చేరుతోంది ..మెల్లగా తాకుతోంది. ఊహ తెలిసినప్పటి నుంచి అతడి పాటలు వింటూ సాగింది జీవితం. లైఫ్ బోర్ గా మారినప్పుడు..జేబు ఖాళీగా ఉన్నప్పుడు . రోడ్డు వెంట ఒక్కడినే నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆ మహోన్నత గాయకుడి మాధుర్యాన్ని తలుచుకుంటూ ..కిషోర్ దా పాటలు వింటూ గడిపా. ఖాదర్ మొహియుద్దీన్ రాసిన ప్రత్యేక స్టోరీ చూసాక అతడిపై అభిమానం మరింత పెరిగింది . 1929 ఆగస్టు 4 న జన్మించిన కిషోర్ అసలు పేరు ..అభాస్ కుమార్ గంగూలీ. ఆయన గాయకుడే కాదు సంగీత దర్శకుడు.రచయిత . నటుడు . నిర్మాత . డైరెక్టర్ కూడా. ఏది పాడినా అది ఆకట్టుకునేలా .. వెంటాడేలా ..మనసుకు జోల పాడేలా చేస్తుంది. పాటల రచయితగా కిషోర్ పేరు పొందారు. కిషోర్ కుమార్ లో లెక్కలేనన్ని కళలు ఉన్నాయి. నవ్వించడం ..నటించడం ఆయనకు మాత్రమే చెల్లింది. వందలాది పాటలు పాడారు.మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచి పోయేలా జ్ఞాపకానికి వస్తూనే ఉన్నాయి . హిందీ లో పేరున్న గాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 'ట్రాజెడీ కింగ్' గా కిష...