పల్లెలు పచ్చగుండాలె ..లేకుంటే చర్యలే..!

నో కాంప్రమైస్ .. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. తెలంగాణలోని పల్లెలు పచ్చగా ఉండాలంతే. అన్ని గ్రామాలలో అరవై రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకారం అమలు చేయాల్సిందే..లేకపోతే కఠిన చర్యలు తప్పవు . ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదు. సంబంధిత అధికారులు , సర్పంచుల సంఘం ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.  ప్రతి ఒక్కరికి టార్గెట్ ఉంటుంది . దానిని రీచ్ కావాల్సిందే. అప్పుడే గ్రామాలు బాగు పడతాయి .స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మిగిలి పోయిన పన్నులతో పాటు అన్ని పన్నులను వసూలు చేయాల్సిన పూర్తి భాద్యత అంతా విలేజ్ సెక్రెటరీలదేనని స్పష్టం చేశారు .

 పచ్చదనం, పరిశుభ్రత వెల్లి విరిసేలా యుద్ధ ప్రాతిపదికన అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ ప్రణాలికను తప్పక అమలు చేయాల్సిందేనని , లేకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు. ఇందు కోసం అధికారులతో పాటు .. ప్రజా ప్రతినిధులు సిద్ధంగా ఉండాలన్నారు . విద్యుత్ వారోత్సవాలు , హరిత హారం ప్రధానంగా ఉంటాయన్నారు . ఆయా గ్రామ పంచాయితీలలో ఎవరికి ఎలాంటి అధికారాలు, విధులు , భాద్యతలు ఉంటాయో ..ఏ విధంగా నిధులు గ్రామాలకు సమ కూరుతాయో స్పష్టంగా ..అన్ని వివరాలు పొందు పరుస్తూ కొత్తగా ఆమోదం పొందిన ..రూపొందించిన పంచాయతీరాజ్ చట్టం కరదీపికలాగా ఉపయోగ పడుతుందన్నారు . 

తెలంగాణలోని పంచాయతీరాజ్‌, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లలో పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సందర్భంగా ప్రకటించారు. ‘అన్ని జిల్లాలకు జిల్లా పంచాయతీ అధికారులను , రెవెన్యూ డివిజన్‌కు ఒక డీఎల్పీవోని, మండలానికొక ఎంపీవోని- మండల పంచాయతీ అధికారిని నియమించాలి. ఈవోపీఆర్‌డీ పేరును ఇక ఎంపీవోగా మార్చాలి. ఎంపీడీవో, సీఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. పోస్టులను భర్తీ చేయడానికి వీలుగా పంచాయతీ అధికారులకు పదోన్నతులు ఇవ్వాలి. శాఖాపరంగా కొత్త నియామకాలు చేపట్టాలి. ఈ ప్రక్రియ అంతా చాలా వేగంగా పూర్తి కావాలి’ అని ఉన్నతాధికారులను కేసీఆర్ఆ దేశించారు. అన్ని గ్రామాల్లో ఆరు నెలల్లో విధిగా శ్మశాన వాటికలు  నిర్మించాలని స్పష్టం చేశారు.

ఇక గ్రామ పంచాయితీల పై ఉన్న భారం దిగి పోయింది. విద్యుత్‌, సాగునీటి కల్పన, చెరువుల పునరుద్ధరణ, రహదారుల నిర్మాణం, విద్య, వైద్యం మొదలైన కీలక పనులన్నీ ప్రభుత్వమే నేరుగా చేస్తుంది. పంచాయతీలు పచ్చదనం, పరిశుభ్రతపై ఎక్కువ దృష్టి పెట్టాలి. 60 రోజులు ముగిశాక ముఖ్య అధికారుల నేతృత్వంలో 100 ప్రత్యేక బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. ఏ గ్రామంలో అయితే 60 రోజుల కార్యాచరణలో నిర్దేశించిన పనులు పూర్తి చేయలేదో అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు . మొత్తం మీద సర్పంచులు జాయింట్ చెక్ పవర్ కోసం చేస్తున్న ఆందోళనలపై సీఎం ఒకింత పట్టించుకోలేదనే చెప్పాలి. 

కామెంట్‌లు