వెంటాడే జ్ఞాపకం..అల్లుకున్న పాటల పరిమళం..!
ఎన్ని సార్లు విన్నా అదే గొంతు మళ్ళీ మళ్ళీ వెంటాడుతూ ...మనసును తరుముతోంది. మల్లెలా ..గులాబీలా..గూడు కట్టుకున్న గుండెలోకి కిషోర్ గాత్రం చేరుతోంది ..మెల్లగా తాకుతోంది. ఊహ తెలిసినప్పటి నుంచి అతడి పాటలు వింటూ సాగింది జీవితం. లైఫ్ బోర్ గా మారినప్పుడు..జేబు ఖాళీగా ఉన్నప్పుడు . రోడ్డు వెంట ఒక్కడినే నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆ మహోన్నత గాయకుడి మాధుర్యాన్ని తలుచుకుంటూ ..కిషోర్ దా
పాటలు వింటూ గడిపా. ఖాదర్ మొహియుద్దీన్ రాసిన ప్రత్యేక స్టోరీ చూసాక అతడిపై అభిమానం మరింత పెరిగింది . 1929 ఆగస్టు 4 న జన్మించిన కిషోర్ అసలు పేరు ..అభాస్ కుమార్ గంగూలీ. ఆయన గాయకుడే కాదు సంగీత దర్శకుడు.రచయిత . నటుడు . నిర్మాత . డైరెక్టర్ కూడా. ఏది పాడినా అది ఆకట్టుకునేలా .. వెంటాడేలా ..మనసుకు జోల పాడేలా చేస్తుంది.
పాటల రచయితగా కిషోర్ పేరు పొందారు. కిషోర్ కుమార్ లో లెక్కలేనన్ని కళలు ఉన్నాయి. నవ్వించడం ..నటించడం ఆయనకు మాత్రమే చెల్లింది. వందలాది పాటలు పాడారు.మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచి పోయేలా జ్ఞాపకానికి వస్తూనే ఉన్నాయి . హిందీ లో పేరున్న గాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 'ట్రాజెడీ కింగ్' గా కిషోర్ పేరొందారు. హిందీ చిత్రాలతో పాటు బెంగాలీ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ, కన్నడ, బోజ్‌పురి, మలయాళం, ఉర్దూ భాషా చిత్రాలలో పాటలు పాడాడు. ఉత్తమ పురుష నేపధ్య గాయకునిగా ఎనిమిది ఫిలిం ఫేర్ పురస్కారాలను పొందాడు. ఈ విభాగంలో అత్యధిక ఫిలిం ఫేర్ పురస్కారాలు పొందిన రికార్డును స్వంతం చేసుకున్నాడు[. మద్యప్రదేశ్ ప్రభుత్వం 1985-86 సంవత్సరంలో "లతా మంగేష్కర్ పురస్కారం" అంద జేసింది. 1997లో కిషోర్ కుమార్ పురస్కారంను ప్రారంభించింది.
1948లో తొలిసారిగా ఫిల్మిస్థాన్ వారి "షికారి" చిత్రంలో చిన్న పాత్ర వేశారు. అదే ఏడాది బాంబే టాకీస్ వారి జిద్దిలో తోటమాలి పాత్ర వేశారు. ఇదే సినిమాలో హీరో దేవానంద్ కు పాడిన నేపథ్య గీతాలు పది మందినీ ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత రిమ్‌జింలో రెండు పాటలు , ప్రముఖ దర్శకుడు బర్మన్ అధ్వర్యంలో ప్యార్ సినిమాలో హీరో రాజ్ కపూర్ కోసం అన్ని పాటలు పాడారు. దీంతో అతడి గాత్ర మాధుర్యం ఎందరికో ఇష్టుడిని చేసింది. నౌజవాన్, బాజీ, బహార్ చిత్రాలలో నేపథ్య గీతాలు, ఆందోళన్, బహార్ చిత్రాలలో నటన కిషోర్ ను గాయక నటునిగా స్థిర పరిచాయి. హేమంతకుమార్, మన్నా డే, రఫీ, మహమ్మద్, జి.ఎం.దురానీ ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకతను, మరపురాని స్థానాన్ని రూపొందించు కోగలిగారు. ప్రారంభంలో సైగల్ ను అనుకరించి, ఆ తర్వాత స్వంత శైలిని ఏర్పరచుకున్నారు. జానపద గేయాలను, శాస్త్రీయ గీతాన్ని కూడా అధ్బుతంగా పాడే తలత్ , మాధుర్యం నిండిన హేమంత్ కుమార్ గళం వీరందరికీ ఒక అడుగు ముందుకు వేసి, రవంత చిలిపితనం కూడా జోడించిన కిషోర్ ..హిందీ చిత్ర సంగీతాన్ని స్పీడ్ యుగం లోకి నడిపించుకు వచ్చాడు.
అధికార్ , చప్‌రే చాప్ , న్యూఢిల్లీ, భాగం భాగ్, భాయ్ భాయ్ చిత్రాలలో నటునిగా, మిస్ మాలా, నౌక్రీ, ముసాఫిర్ చిత్రాలలో విషాంత రేఖలు వున్న హాస్యనటుడిగా స్థిరపడిన కిషోర్ 1958 లో, చల్తీకా నాం గాడీ చిత్రంలో తారా స్థాయి అందుకున్నారు. ఈ చిత్రంలో కిషోర్ పాడిన పాటలు ఈ నాటికీ మారు మ్రోగుతున్నాయి. నటుడుగా, హాస్య పాత్రధారిగా, గాయకుడుగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుని, చిత్ర రంగంలో స్థిరపడిన తరుణంలో 1961 లో కొత్త అవతారమెత్తారు ఝమ్రూ సినిమాకు సంగీత దర్శకత్వం, పాటల రచన బాధ్యతలు చేపట్టారు. అంతటితో ఆగలేదు. కొషోర్ ఫిలిమ్స్ బ్యానర్ కింద సినిమా నిర్మాణం చేపట్టి, తాను డైరక్ట్ చేయడం. సంగీత దర్శకత్వం చేపట్టడం, పాటలు రాయడం, నటించడం, వీలయినంత మేరకు ఇతర సాంకేతిక బాధ్యతల పర్యవేక్షణ చేయడం ప్రారంభించారు.
పదాల కలయికలో ఎంత భావమున్నదో కిషోర్ జీవితంలో అంత కంటే ఎక్కువ గాఢమైన వ్యధ ఉంది. ఏ పరిస్థితులలోనూ రాజీ పడలేదు. ఊపిరి పీల్చినంత కాలమూ దర్జాగా నవ్వుతూ, నవ్విస్తూ కాలం గడిపారు. కిషోర్ వ్యక్తిత్వాన్ని 90 శాతం గ్రహించిన వాళ్ళూ ఇద్దరే ఉన్నారు. ఆయన భార్యల్లో రెండవ భార్య మధుబాల, నాల్గవ భార్య లీనా చందావర్కర్. మధుబాలను కిషోర్ స్వప్న దేవతగా పేర్కొనవచ్చు. ఆమెను దృష్టిలో వుంచుకొనే రాత్ కలీ ఏక్ ఖాబ్ మె ఆయీ ఔర్ గలే కా హార్ హుయి..అన్నాడు. హాల్ క్యా హై జనాబ్ కా.. అంటూ మందహాసం చేస్తూ స్వరం కలిపింది లీనా.
జీవితంలో అనేక సందర్భాలలో తీవ్ర మనస్తాపానికి, పలువురి కువిమర్శలకు, ఎన్నో రకాల చికాకులకు గురైన కిషోర్ తన మనోనిబ్బరాన్ని, ఆత్మ స్థైర్యాన్ని ఏ మాత్రం చెక్కు చెదర నివ్వలేదు. వ్యక్తిగా కూడా కిషోర్ చాలా ఉన్నతుడు. చలన చిత్రాలలో గాని, స్టేజీ మీద గాని గంతులు వేస్తూ, మేనరిజం లను అభినయిస్తూ, ప్రజలను కడుపుబ్బ నవ్వించిన కిషోర్‌ది నిజానికి చాలా గంభీర స్వభావం. సినీ ప్రపంచ హంగామాలకు, ఆడంబర విన్యాసాలకు, పార్టీలకు చాలా దూరంగా ఉండేవారు. ఆనందమైనా, దుఖఃమైనా తనలోనే యిముడ్చుకొని, వ్యక్తిగత జీవిత వైఫల్యాలను తనవరకే పరిమితం చేసుకున్న మహోన్నత వ్యక్తి కిషోర్.
కిషోర్ ప్రాభవాన్ని స్మరించుకునే సందర్భంలో తప్పని సరిగా ఆరాధన సినిమాలో పాటల గూర్చి ముచ్చటించు కోవాలి. రూప్ తేరా మస్తానా, మేరే సప్నోంకి రాణి, ఈ రెండు పాటలు యావద్భారతంలో మారు మ్రోగాయి. రాజేష్ ఖన్నాకు బంగారు భవిష్యత్తును చూపాయి. ఈ సినిమా విడుదల తర్వాతనే కిషోర్ కూ స్వర్ణయుగం ప్రారంభమైంది. హిందీ సినీ రంగంలోని సంగీత దర్శకులు అందరూ కిషోర్ చేత దాదాపు అందరు హీరోలకూ పాడించారు. కిషోర్ గాన మాధుర్యాన్ని చిరకాలం స్మరించటానికి మనకు అవకాశమిచ్చిన వారిలో ఎస్.డి.బర్మన్ ప్రథములు. ఈయన సంగీత దర్శకత్వంలో వెలువడిన మొత్తం 50 పాటలూ చిత్రరంగంలో నేపథ్య గానం ఉన్నంత వరకూ నిలిచే యుంటాయి. ఒక దీపావళి రోజున కిషోర్ ఆకశ్మికంగా మరణించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి