అతడే మ్యాచ్ డిసైడర్

వరుస వైఫల్యాలతో తీవ్ర నిరాశ పరుస్తున్న రిషబ్ పంత్ పై మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోడ్ మాత్రం పూర్తి నమ్మకాన్ని ప్రకటించాడు. ఇంకో వైపు టీమిండియా సారధి కోహ్లీ మాత్రం పంత్ కు బాసటగా నిలిచాడు. అయినా రిషబ్ మాత్రం ఇంకా మైదానంలో ఆశించిన మేర రాణించడం లేదు. కాగా గత చివరి 15 ఇన్నింగ్స్‌ల్లో ఒక అర్ద సెంచరీ.. ఎనిమిది మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్ స్కోర్ మాత్రమే చేశాడు. ఇది టీమిండియా యువ సంచలనం రిషభ్ పంత్ బ్యాటింగ్ పరిస్థితి. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల్లో వరుసగా 18, 33 నాటౌట్, 0 పరుగులతో తీవ్రంగా నిరాశ పరిచాడు. దీంతో పంత్‌పై అటు క్రికెట్ అభిమానులతో పాటు, క్రీడా పండితులు దుమ్మెత్తి పోస్తున్నారు. అంతే కాకుండా పంత్‌ను తప్పించి కేరళ క్రికెటర్ సంజూ శాంసన్‌ను తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో రిషభ్ పంత్‌పై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత కొద్ది నెలలుగా అతడి బ్యాటింగ్, వికెట్ కీపింగ్ తీరును టీమ్ మేనేజ్‌మెంట్ నిశితంగా పరిశీలిస్తోంది. అతడిలో అపారమైన ప్రతిభ దాగుంది. అతడు టీమిండియాలో లేక ఏ జట్టులో ఉన్నా ఎక్స్ ఫ్యాక్టర్...