మోదీపై గాంధీ గరం గరం
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దేశమంతటా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కమల దళం ఫైర్ అవుతోంది. ఈ జాతికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఊపందు కుంటోంది. ఇదిలా ఉండగా దేశంలో అత్యాచారాల గురించి తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కు తగ్గబోనని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాహుల్ ‘రేప్ ఇన్ ఇండియా’ అంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేతలు కోరుతున్నారు.
ఈ విషయంపై మరింత రాద్ధాంతం పెరగడంతో రాహుల్ మరింత సీరియస్ అయ్యారు. నా పేరు రాహుల్ గాంధీ. నేను సావర్కర్ కాదు. నేను నిజమే మాట్లాడాను. చావనైనా చస్తాను కానీ క్షమాపణ మాత్రం చెప్పను అంటూ స్పష్టం చేశారు.
ఈ దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్న అమిత్ షా, ఆర్ధిక వ్యవస్థను సర్వ నాశనం చేసిన ప్రధాని నరేంద్ర మోదీజీ ఈ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు రాహుల్ గాంధీ. ఈ సందర్బంగా మోదీని టార్గెట్ చేశారు. నిప్పులు చెరిగారు. తనకు తానుగా దేశభక్తుడిగా అభివర్ణించుకునే ప్రధాని.. ఒంటి చేత్తో ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ సైతం కొడుక్కి సపోర్ట్ గా నిలిచారు. ఆమె సైతం బీజేపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ చివరి శ్వాస వరకూ పోరాడుతూనే ఉంటుందన్నారు.
ప్రజలందరూ అన్యాయంపై గళ మెత్తాల్సిన సమయం ఆసన్న మైందని అన్నారు. దేశంలో ప్రస్తుతం అరాచక రాజ్యం నడుస్తోందని, సబ్‌కా సాథ్, సబ్ కా వికాస్ అన్న అధికార పక్ష నినాదం స్ఫూర్తి ఏదని దేశం మొత్తం ప్రశ్నిస్తోందని బీజేపీపై విరుచుకు పడ్డారు. ఈ నాటి అరాచకత్వంపై పోరాడక పోతే మనం చరిత్రలో పిరికి వాళ్లుగా మిగిలి పోతామని అన్నారు ప్రియాంకా గాంధీ. ఇదిలా ఉండగా హిందుత్వ సిద్ధాంతాల విషయంలో తమ పార్టీ రాజీ పడే ప్రసక్తే లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి