ఫ్యూచర్ దే ఇండియా
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్ లో ఇండియా దూసుకెళుతోంది. కంపెనీలు అన్నీ ఇప్పుడు ఇండియా జపం చేస్తున్నాయి. అమెరికాలో దాదాపు 30 శాతానికి పైగా భారత ఐటీ నిపుణులు తమవంతు సేవలు అందజేస్తున్నారు. అంతే కాకుండా ఇండియన్స్ పెద్ద ఎత్తున ప్రతిభ పాటవాలతో టాప్ పొజిషన్స్ లలో బిగ్గెస్ట్ పోస్టు లలో కొనసాగుతున్నారు. మనోళ్లు ఏకంగా ముఖ్య కార్యనిర్వహణ అధికారులుగా, చైర్మన్లుగా, మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్నారు. దీంతో మన వాళ్ళ సత్తా ఏమిటో ఈపాటికే అర్థమై ఉంటుంది. చాలా కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి. దిగ్గజ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు మన దేశానికి చెందిన సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సిఇఓలుగా ఉన్నారు. వీరిద్దరూ నువ్వా నేనా అన్న రీతిలో పోటీపడి పని చేస్తున్నారు.
తాజాగా మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ఇండియా గురించి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రానున్న దశాబ్ధంలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధించి ప్రజలను పేదరికం నుంచి బయట పడేస్తుందని బిల్ గేట్స్ అన్నారు. దేశం అనుసరిస్తున్న ఆధార్ వ్యవస్థ, ఆర్థిక సేవలు, ఫార్మా రంగాల్లో కనబరుస్తున్న సామర్ధ్యం ప్రశంస నీయమైనవని కొనియాడారు. దేశంలో ఆర్థిక మంద గమనంపై ఆందోళన నెలకొంది. స్లోడౌన్ ప్రభావం మరి కొన్నేళ్లు సాగుతుందనే భయాల నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తి బిల్ గేట్స్ భారత ఎకానమీపై సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
స్వల్ప కాలంలో ఏం జరుగుతుందనేది తనకు తెలియక పోయినా, రానున్న దశాబ్ధంలో భారత్‌లో అనూహ్య వృద్ధి రేటు నమోదవుతుందని వ్యాఖ్యానించారు. 110 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్‌ను వెనక్కు నెట్టి 64 ఏళ్ల బిల్‌గేట్స్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా తిరిగి తన స్ధానాన్ని నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు గేట్స్ ఇండియాను సందర్శించారు. భారత్‌లో ఆధార్ వ్యవస్థ పని తీరును గేట్స్ ప్రశంసించారు. ఇతర దేశాల్లోనూ ఈ తరహా వ్యవస్ధను ప్రవేశ పెట్టేందుకు మార్గాలను అన్వేషించాలని అన్నారు. ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు భారత్‌లో అద్భుత వ్యాక్సిన్లను రూపొందిస్తున్నారని కొనియాడారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి