సరిలేరు నీకెవ్వరూ ..దేవిశ్రీ ..!

తెలుగు సినిమా రంగంలో మెల్లగా వచ్చి ..సునామీలా అల్లుకు పోయాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ . ఆయన తండ్రి గొప్ప మాటల రచయిత . అందుకేనేమో పదాలను ఎలా వాడుకోవాలో ..ఎవరితో రాయించు కోవాలో దేవిశ్రీ కి తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలియదనుకుంటా. ఇవ్వాళ్టితో ఆయనకు 39 ఏళ్ళు . ఆనందం సినిమా అప్పట్లో వచ్చింది . దానికి ఆయనే సంగీతం అందించారు . గొప్ప సాహిత్యం అందులో ని పాటల్లో ఉండేలా చేసాడు . స్వతహాగా సాహిత్యం ..సంగీతం పట్ల ప్రేమ ..అభిమానం ఉండటం వల్ల దేవిశ్రీ అప్పటి నుంచి నేటి దాకా అతడు చేసే ప్రతి మూవీ సాంగ్స్ ను వినడం అలవాటుగా మార్చుకున్నా. పాటలే కాదు సినిమాకు ..సమయానికి తగ్గట్టు ..ఆయా పాత్రలకు సరిపోయే విధంగా ..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం కూడా కత్తి మీద సాము లాంటిదే. అలాంటి సినిమాలు వచ్చాయి ..ఆడాయి ..మరికొన్ని బాక్సాఫీస్ వద్ద డబ్బులు వచ్చేలా చేశాయి . 1979 ఆగస్టు 2 న పుట్టారు . దేవిశ్రీ సంగీత దర్శకుడే కాదు ..రచయిత ...కవి కూడా . అంతకంటే గొప్ప గాయకుడు . దక్షిణాది లో పేరు మోసిన సంగీత దర్శకుల్లో దేవి ఒకడు . కస్టపడి పైకొచ్చాడు . ఏనాడు తండ్రి పేరు వాడుకోలేదు . ఆయన అందించిన సంగీతం వల్ల దాదాపు ఎనిమిది...