సరిలేరు నీకెవ్వరూ ..దేవిశ్రీ ..!

తెలుగు సినిమా రంగంలో మెల్లగా వచ్చి ..సునామీలా అల్లుకు పోయాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ . ఆయన తండ్రి గొప్ప మాటల రచయిత . అందుకేనేమో పదాలను ఎలా వాడుకోవాలో ..ఎవరితో రాయించు కోవాలో దేవిశ్రీ కి తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలియదనుకుంటా. ఇవ్వాళ్టితో ఆయనకు 39 ఏళ్ళు . ఆనందం సినిమా అప్పట్లో వచ్చింది . దానికి ఆయనే సంగీతం అందించారు . గొప్ప సాహిత్యం అందులో ని పాటల్లో ఉండేలా చేసాడు . స్వతహాగా సాహిత్యం ..సంగీతం పట్ల ప్రేమ ..అభిమానం ఉండటం వల్ల దేవిశ్రీ అప్పటి నుంచి నేటి దాకా అతడు చేసే ప్రతి మూవీ సాంగ్స్ ను వినడం అలవాటుగా మార్చుకున్నా. పాటలే కాదు సినిమాకు ..సమయానికి తగ్గట్టు ..ఆయా పాత్రలకు సరిపోయే విధంగా ..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం కూడా కత్తి మీద సాము లాంటిదే. 

అలాంటి సినిమాలు వచ్చాయి ..ఆడాయి ..మరికొన్ని బాక్సాఫీస్ వద్ద డబ్బులు వచ్చేలా చేశాయి . 1979 ఆగస్టు 2 న పుట్టారు . దేవిశ్రీ సంగీత దర్శకుడే కాదు ..రచయిత ...కవి కూడా . అంతకంటే గొప్ప గాయకుడు . దక్షిణాది లో పేరు మోసిన సంగీత దర్శకుల్లో దేవి ఒకడు . కస్టపడి పైకొచ్చాడు . ఏనాడు తండ్రి పేరు వాడుకోలేదు . ఆయన అందించిన సంగీతం వల్ల దాదాపు ఎనిమిది ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు . స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా తీసుకున్నారు . నంది పురస్కారం పొందారు . దేవిశ్రీ తెలుగు , తమిళ్ , కన్నడ , హిందీ సినిమా రంగాలలో మూవీస్ కు సంగీతం అందించారు . 1999 లో దేవి సినిమాకు సంగీతం అందించారు. 2001 నవ్వుతూ బతకాలిరా , ఆనందం , కలుసుకోవాలని , ఖడ్గం , తొట్టి గ్యాంగ్ , సొంతం , వర్షం , వెంకీ , అభి , ఆర్య , శంకర్ దాదా ఎంబీబీఎస్ , మాస్ , నా అల్లుడు , నువ్వు వస్తానంటే నేనొద్దంటానా , బన్నీ , భద్ర సినిమాలకు మ్యూజిక్ అందించాడు .

ఒక ఊరిలో , అందరివాడు , పౌర్ణమి , బొమ్మరిల్లు , రాఖీ , జగడం , ఆట , శంకర్ దాదా జిందాబాద్ , తులసి , జల్సా , రెడీ , కింగ్ , కరెంట్ , ఆర్య -2 , నమో వెంకటేశా , సయ్యాట , మిస్టర్ పెర్ఫెక్ట్ , 100 పెర్సెంట్ లవ్ , ఊసరవెల్లి , గబ్బర్ సింగ్ , జులాయి , డమరుకం , సారొచ్చారు , మిర్చి , ఇద్దరమ్మాయిలతో , ఎవడు , అత్తారింటికి దారేది , వీరభద్రం , నేనొక్కడినే , లెజెండ్ , అల్లుడు శ్రీను , సన్నాఫ్ సత్యమూర్తి , శ్రీమంతుడు , శివమ్ , కుమారి 21 ఎఫ్ , నేను శైలజ , సర్దార్ గబ్బర్ సింగ్ , జనతా గ్యారేజ్ , ఖైదీ నెంబర్ 150 , నేను లోకల్ , రారొండోయ్ వేడుక చూద్దాం , దువ్వాడ జగన్నాథం , జయ జానకి నాయిక , జై లవకుశ , ఎంసీఏ , రంగస్థలం , భరత్ అనే నేను , హలో గురూ ప్రేమ కోసమే , వినయ విధేయ రామ , ఎఫ్ 2 , చిత్రాలహరి , మహర్షి సినిమాలకు సంగీతం అందించారు . ఎన్నో అవార్డులు ..పురస్కారాలు అందుకున్న దేవిశ్రీ మరిన్ని సినిమాలకు సంగీతం అందించి ..మనల్ని ఇలాగే అలరించాలని కోరుకుందాం .   

కామెంట్‌లు