లెండింగ్ సెక్టార్ లోకి రియల్ మి

చైనా మొబైల్ దిగ్గజం షావోమికి షాకిచ్చేలా మరో చైనా మొబైల్ మేకర్ ఒప్పో రంగం సిద్ధం చేసింది. భారత వినియోగదారులకు చిన్న చిన్న అప్పు లిచ్చేందుకు షావోమి తీసుకొచ్చిన ‘ఎంఐ క్రెడిట్’ మాదిరిగా ఆర్థిక సేవల ప్లాట్‌ఫాంను రియల్‌మి తాజాగా లాంచ్ చేసింది. రియల్ మి పేసా పేరుతో భారత మార్కెట్లో రుణాల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం ఫిన్‌టెక్ స్టార్టప్ఫిన్‌షెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా దేశంలోని వినియోగదారులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు లావాదేవీలను సులభతరం చేయడంతోపాటు, తమ వృద్ధిని బలపేతం చేసుకోవాలనేది రియల్‌మి లక్ష్యం. కస్టమర్లకు ఆర్థిక సేవలను సులభతరం చేయడమే తమ లక్ష్యమని రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్ సేత్ ప్రకటించారు. టైర్-1, టైర్- 2 పట్టణాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నామని క్రమంగా ఇతర పట్టణాలకు విస‍్తరిస్తామన్నారు. రియల్‌మి పేసా వ్యక్తులు, సంస్థలకు అనేక రకాల ఆర్థిక సేవలను అందిస్తుంది. చిన్న వ్యాపారాలు భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగమనే విషయాన్ని గుర్తించిన తాము తొలిసారిగా ఇలాంటి సదుపాయాన్ని తీసుకొచ్చిన మొబైల్ సంస్థతామేనని రియల్‌మి వెల్లడించి...