నల్లమల కోసం సినీ జనం

ప్రకృతి రమణీయతకు ఆలవాలంగా నిలుస్తూ, వేలాది మంది అడవి బిడ్డలకు నీడనిస్తూ , అపారమైన వనరులు కలిగిన నల్లమలలో యురేనియం తవ్వకాలపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ఇప్పటికే చెంచు పెంటల్లో , గిరిజనులు, చెంచులు, ఇతర సమూహమంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా యురేనియం వ్యతిరేక కమిటీగా ఏర్పడ్డారు. అన్ని పార్టీలు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, ప్రజలతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డారు. ఇప్పటికే తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం, మహిళా నాయకురాలు భవాని రెడ్డిని నాగర్ కర్నూల్ లోనే అరెస్ట్ చేశారు. మరో వైపు ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి నల్లమలను సందర్శించి బాధితులకు భరోసా ఇచ్చారు. నల్లమల ఏపీ, తెలంగాణాలో విస్తరించి ఉన్నది. అపారమైన అటవీ ప్రాంతం, జీవరాసులు, టైగర్ ప్రాజెక్టు , ఔషదాలు, ఖనిజ నిక్షేపాలు నిక్షిప్తమై ఉన్నవి. ఇక్కడ యురేనియం త్రవ్వకాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా గతంలో కడపలో ఏర్పాటు చేసిన యురేనియం త్రవ్వకాలు తమకు వద్దంటూ అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దీంతో సీఎం జగన్ ప్రత్యేక కమిటీని నియమించారు. మరో వైపు యురే...