ఉగ్రవాదం నిజం..జిహాదీలకు శిక్షణ వాస్తవం - ఒప్పుకున్న పాక్
కుక్క తోక వంకర అన్నట్టు దాయాది పాకిస్తాన్ తన తీరును మార్చు కోవడం లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో లేని రాద్ధాంతం సృష్టిస్తూ భారత దేశంపై లేని పోని ఆరోపణలు చేస్తూనే మరో వైపు తీవ్రవాదులకు, ఉగ్ర మూకలకు పరోక్షంగా మద్దతునిస్తూ కవ్వింపులకు దిగుతోంది. కయ్యానికి సై అంటోంది. అంతర్జాతీయ వేదికపై ఇప్పటికే తన వితండ వాదనను వినిపించింది. ఇదే సమయంలో అగ్ర రాజ్యాలు అమెరికా, రష్యాతో పాటు ప్రతి దేశమూ ఇండియా వైపు నిలిచాయి. ఒక్క చైనా దేశం మాత్రం పాకిస్తాన్ కు వంత పాడింది. దీంతో ఎంతో నమ్మకం పెట్టుకున్న పాకిస్తాన్ ఒంటరిగా వుండి పోయింది. పాలుపోని పరిస్థితుల్లో ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాత్రం తన నోటికి పని చెబుతూనే ఉన్నారు. అరబ్ దేశాల అధిపతులను కలిశారు.
ఇతర దేశాల ప్రెసిడెంట్స్, ప్రధానులను ఇండియా మోసం చేసిందంటూ విన్నవించారు. అయినా ఏ ఒక్క కంట్రీ పాకిస్తాన్ కు మద్దతు పలక లేదు. అంతే కాకుండా జమ్మూ, కాశ్మీర్ ముమ్మాటికీ భారత దేశం లో అంతర్భాగమేనని స్పష్టం చేశాయి. యుద్దానికి తమ దేశం సిద్ధంగా ఉండాలని ఇమ్రాన్ పిలుపు ఇచ్చారు. ఇటీవల పీఎం అమెరికా పర్యటించారు. కాశ్మీర్ విషయంలో జోక్యం చేసు కోవాలని కోరారు. దీనికి అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కూడా ఒకే చెప్పారు. దీనిని ఆసరాగా చేసుకుని ఇమ్రాన్ ఖాన్ మరీ రెచ్చి పోయాడు. మోడీపై, ఇండియాపై తన అక్కసు వెళ్లగక్కాడు. తమ దేశం మీదుగా విమానాలు వెళ్లకుండా నిషేధం విధించాడు. అదే అమెరికాలో మాట్లాడుతూ తమ దేశంలో తీవ్రవాదులు ఉన్నారని, దీనికి గత పాలకులే కారణమని ఇమ్రాన్ చెప్పారు. నిజం ఒప్పుకున్నారు కూడా.
ఈ మొత్తం వ్యవహారాన్ని గమనించిన భారత ప్రభుత్వం అత్యవసరంగా మోదీ నేతృత్వంలో సమావేశమైంది. అవసరమైతే పాకిస్థాన్ తో యుద్ధం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని మోదీ ప్రకటించారు. ఈ సందర్బంగా అమెరికా, రష్యా, అరబ్ దేశాలతో మోదీ మాట్లాడారు. జమ్మూ, కాశ్మీర్ అన్నది ఈ దేశంలో అంతర్భాగం అని స్పష్టం చేశారు. దీంతో అమెరికా దిగి వచ్చింది. పాకిస్తాన్ ఎలా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నదో అంతర్జాతీయ వేదికపై ఇండియా నిరూపించింది. పాకిస్తాన్ కు వాయిస్ లేకుండా పోయింది. ఐక్య రాజ్య సమితిలో భారతీయ శాశ్వత ప్రతినిధి తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. దీంతో భారత్ తో మైత్రిని కొనసాగిస్తున్న అమెరికా పాక్ ను హెచ్చరించింది. ఇండియాతో చర్చలు కొనసాగించాలని సూచించింది. అయినా పాకిస్తాన్ లో మార్పు రాలేదు. తాజాగా తమ దేశం జిహాదీలకు శిక్షణ ఇచ్చిన విషయం వాస్తవమేనని ఒప్పుకున్నారు. మొత్తం మీద పాక్ తనంతకు తాను దోషిగా నిలబెట్టుకుంటోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి