మోస్ట్ సక్సెస్ ఫుల్ సీఇఓలు వీరే..హ్యాట్స్ ఆఫ్ మనోజ్ జైన్..!

భారత దేశం ఆర్ధిక సంక్షోభంలో కూరుకు పోయినా వివిధ రంగాలకు చెందిన కంపెనీలు సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. దీనికంతటికి కారణం ఆయా కంపెనీలకు సీఇవోలుగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ గా ఉండటమే. తాము కష్టపడుతూ తమతోటి ఉద్యోగులు, సిబ్బందిలో స్ఫూర్తి నింపుతూ విజయ పథంలో తీసుకు వెళుతున్నారు. అంతే కాకుండా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రయత్నం చేస్తున్నారు. తోటి వారితో కలిసి విస్తరిలో పాల్గొంటూ తాము కూడా మీలాంటి వారమని చెప్పకనే చెబుతున్నారు. అలాంటి సీఇఓ లలో షావో మీ స్మార్ట్ మొబైల్స్ కంపెనీ ఇండియా హెడ్ మనోజ్ కుమార్ జైన్ మొదటి వరుసలో నిలుస్తున్నారు.

ఆయన ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్ గా మారారు. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా షావో మీ మొబైల్స్, యాక్ససరీస్ అందుబాటులో ఉండేలా చేశారు. మిగతా దిగ్గజ మొబైల్స్ కంపెనీలకు షాక్ ఇచ్చారు. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ లింక్డ్ ఇన్ మోస్ట్ పేవరబుల్ సీయిలను వెల్లడించింది. టెక్నాలజీ, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సస్, ఇంటర్ నెట్ , మార్కెటింగ్ రంగాలలో ఎనిమిది మందిని ఎంపిక చేసింది. వారిలో కస్టమర్ సపోర్ట్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ ఫ్రెష్ డెస్క్ సీఇఓ గిరీష్ మాతృభూతం, గూగుల్ సౌత్  ఈస్ట్ ఏషియా అండ్ ఇండియా వైజ్ ప్రెసిడెంట్ రాజన్ ఆనంద్ చోటు దక్కించుకున్నారు.

ఇక సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్ వేర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ బోస్ , షావోమి చైనా కంపెనీ ఇండియా హెడ్ మను కుమార్ జైన్ ఉన్నారు. సీటీఓ ప్రాక్టో కో ఫౌండర్ అభినవ్ లాల్ , జీఈ గ్లోబల్ గ్రోత్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇన్ఫర్ మేషన్ ఆఫీసర్ గా వున్నా ఆంథోనీ థామస్ కస్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఇక గ్లోబల్ సీఐవో భారతి ఎయిర్ టెల్ హంరీన్  మెహతా చోటు దక్కించుకున్నారు. మొత్తం ఎంపిక చేసిన వారిలో ఒకే ఒక్క మహిళ మెహతాకు చోటు దక్కడం విశేషం. అంతకు ముందు ఆమె హెచ్ ఎస్ బి సి, బ్యాంక్ ఆఫ్ అమెరికా లో పని చేశారు. అక్కడ వాటిని గాడిలో పెట్టారు. సక్సెస్ ఫుల్ బాటలోకి తీసుకు వెళ్లారు. నిబద్దత, పట్టుదల, కష్టపడటం , కనెక్టివిటీ కలిగి ఉండటమే వీరి సక్సెస్ కు కారణం. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!