చతికిల పడిన గృహ రంగం..ఆదుకునేనా ప్రభుత్వం

డీమానిటరైజేషన్ దెబ్బకు భారత దేశంలోని అన్ని రంగాలు డీలా పడ్డాయి. నోట్ల రద్దు వ్యాపారుల పాలిట శాపంగా మారింది. దిగ్గజ కంపెనీలు ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్ లైన్ లోకి ఎంటర్ అయ్యాయి. ఆయిల్, ఫ్యాషన్, జ్యుయలరీ , గోల్డ్, డైమండ్స్, ప్లాట్లు , ఫ్లాట్స్, కాంప్లెక్స్ లు , వాహనాలు, పొలాలు, గృహ రుణాలు, ఫుడ్ ఐటమ్స్, దుస్తులు, ఆభరణాలు, కార్ల బుకింగ్, టాయిస్ , ఫ్లైట్స్, ట్రైన్స్, బస్సులు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ఇంటి వద్ద నుంచే ఒకే ఒక్క క్లిక్ తో అన్నీ లభిస్తున్నాయి. దీంతో పాటు ఆయా కంపెనీలు భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్స్థ గాడి తప్పింది. విత్త మంత్రి ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. ఉద్దేపన చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఉన్న బ్యాంకులను మెర్జ్ చేసే పనిలో పడింది. దీని వల్ల ప్రజలకు మరిన్ని కస్టాలు ఎదురవుతాయే తప్పా ఒరిగేది ఏమీ ఉండదు.

దేశంలో అతి పెద్ద బ్యాంక్ గా పేరున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోజుకో కొత్త నిర్ణయంతో

ఇందు కోసం ప్రత్యేకంగా హోసింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో సామాన్యులు సైతం గృహాలు కొనుగోలు చేసుకోవచ్చు. ఇదంతా చతికిలపడిన హోసింగ్ రంగానికి మరింత బలం చేకూర్చేందుకే నని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఆగిపోయిన ప్రాజెక్టులు జోరందుకుంటాయి. ఇళ్ల అమ్మకాలు పెరుగుతాయి. క్రెడిట్ స్కోర్ లేని వారు. రుణాలు క్రమంగా చెల్లించ లేని వారికి ఇది మేలు చేస్తుంది. ఒక్క హోసింగ్ రంగానికి సపోర్ట్ చేస్తే స్టీల్, సిమెంట్ రంగాలు గాడిలో పడతాయి. దీంతో పాటు వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. నైపుణ్యం కలిగిన పని వాళ్ళతో పాటు కార్మికులు అవసరమవుతారు. అయితే తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తే ఈజీగా ఇల్లు పూర్తి చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని ఇటీవలే చెప్పారు విత్త మంత్రి నిర్మలా సీతారామన్. మొత్తం మీద హోసింగ్ ఫండ్ ఎంత త్వరగా వస్తే అంత కంటే ఎక్కువగా పేదలు ఆనంద పడతారు.
ఖాతాదారులకు చుక్కలు చూపిస్తోంది. మరో వైపు ప్రధాన నగరాల్లో ఆర్థిక మాంద్యం దెబ్బకు రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా చతికిల పడిపోయింది. ఇల్లు, ఫ్లాట్స్ కొనేవారు లేక రియల్ ఎస్టేట్ కంపెనీలు బార్లా తెరుచుకున్నాయి. కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రం ఇళ్ల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యులు ఇల్లు కొనే పరిస్థితి లేదు. అద్దెకు ఉండే స్థోమత లేకుండా పోయింది. ఆర్ధిక మంద గమనం ప్రభావం గృహ రంగంపై కూడా భారీగా పడింది. ఎక్కడికక్కడ ప్రాజెక్టులన్నీ ఆగి పోయాయి. ఇంకో వైపు ఇల్లు కొనుగోలు చేయాలనీ అనుకున్నా, బ్యాంకుల వద్దకు వెళితే రుణాలు పొందేందుకు అర్హులు కారంటూ దరఖాస్తులు మొదట్లోనే తిరస్కరిస్తున్నాయి. దీంతో ఇల్లు కొనుగోలు అనేది కలగా మారుతోంది. దీనిని గమనించిన ప్రభుత్వం బ్యాంకులకు గ్యారెంటీ ఇస్తే కొంత మేర ఊతం ఇచ్చి నట్లవుతుందని ఆలోచిస్తోందని సమాచారం.

కామెంట్‌లు