పోస్ట్‌లు

నవంబర్ 11, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మనీ వద్దు..మీ అభిమానం చాలు

చిత్రం
బిగ్ బాస్ రియాల్టీ షోతో టాప్ రేంజ్ లోకి చేరుకున్న యాంకర్ శ్రీముఖి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. అవార్డు, మనీ నాకేమీ వద్దు. మీ ఆదరాభిమానాలు నాకు చాలు అని ఈ ముద్దుగుమ్మ తెలిపింది. అయితే నిజమైన విజేత మాత్రం బాబా భాస్కర్ అని కుండా బద్దలు కొట్టింది. అయితే విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ అయినా.. ప్రేక్షకుల మనసు గెలిచింది మాత్రం బుల్లితెర రాములమ్మే నంటూ శ్రీముఖి అభిమానులు చెప్పుకొచ్చారు. బిగ్‌బాస్‌ పూర్తవగానే    మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్‌ చేసింది. ఈ క్రమంలో అభిమానులతో మొదటిసారి లైవ్‌లోకి వచ్చింది. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ షో గురించి పలు ఆసక్తికర అంశాలను పంచుకుంది. తనకు ఎంతగానో మద్దతు తెలిపిన ఝాన్సీ, రష్మీ, ముక్కు అవినాష్‌, ఆటో రాంప్రసాద్‌లకు కృతజ్ఞతలు తెలిపింది.  నామినేషన్‌లోకి వచ్చినప్పుడు భయపడ లేదని, ఎందుకంటే తానే తప్పూ చేయలేదని, పైగా అభిమానులు సేవ్‌ చేస్తారన్న నమ్మకముండేదని చెప్పుకొచ్చింది. ట్రెడిషనల్‌గా, మోడ్రన్‌గా, మేకప్‌తో, మేకప్‌ లేకుండా అన్ని రకాలుగా చూశారు. నన్ను మీ ఇంట్లో అమ్మాయిగా ఆదరించారు. నువ్వే మాకు రియల్‌ విన్నర్‌ అని చాలా విషె...

హెవీ డిమాండ్..పీకే కు పెరిగిన క్రేజ్

చిత్రం
ఆసియాలో మోస్ట్ ఫెవరబుల్ పర్సన్ గా పేరు తెచ్చుకున్నారు ప్రశాంత్ కిషోర్. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఇండియాలో టాప్ పొజిషన్లో కొనసాగుతున్నారు. ఆయన అపాయింట్ మెంట్ కోసం ఎందరో తలపండిన రాజకీయ నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలు వెయిట్ చేస్తున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు పీకే స్టామినా ఏమిటో. ఇప్పటికే ఆయన ఎవరితోనైనా చేతులు కలిపారంటే ఇక విజయం సిద్దించినట్లే. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి కి వెన్నుదన్నుగా ఉన్నారు. ఆయన విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటి దాకా పవన్ కళ్యాణ్, చంద్ర బాబు నాయుడు తో పాటు మమతా బెనర్జీ, మాయావతి, తదితర దిగ్గజాలు టచ్ లో ఉన్నారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బెంగాల్ దీదీ తో రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. తన ఐడియాస్ ను ఇంప్లిమెంట్ చేసే పనిలో పడ్డారు. తాజగా ఆయన దృష్టి తమిళనాడుపై పడింది అన్నది వైరల్ గా మారింది. అక్కడ పాలిటిక్స్ ఎక్కువగా సినీ రంగంతో ముడిపడి ఉంటాయి. ఇప్పటికే సూపర్ స్టార్ రజని కాంత్, కమల్ హాసన్, కుష్బూ , శరత్ కుమార్, విశాల్ రెడ్డి తో పాటు తాజాగా ఎనర్జటిక్ స్టార్ విజయ్ కూడా చేరి పోయాడు. ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ ..విజయ్ తో బీట్ అయినట్టు సమాచారం. కొద్దిగా కష్టపడ...

ధోనీ చెక్కిన శిల్పం..చాహర్ అద్భుతం

చిత్రం
తన అద్భుతమైన బౌలింగ్ తో దేశం తన వైపు చూసేలా చేసుకున్న చాహర్ ను వెన్నుతట్టి ప్రోత్సహించింది మాజీ సారధి ధోనీనే. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మీటింగ్ లో పేసర్‌ దీపక్‌ చాహర్‌ రాబోయే లీగ్‌లో 14 మ్యాచ్‌లూ ఆడతాడు. ఇక మనం వేరే ఆటగాళ్ల గురించి మాట్లాడుకుందాం అంటూ స్పష్టం చేశారు ధోనీ. అతడిపై ఆయనకున్న నమ్మకం అలానిది. నమ్మకాన్ని చాహర్‌ వమ్ము చేయలేదు. పదునైన స్వింగ్‌ బౌలింగ్‌ను ప్రదర్శిస్తూ కేవలం 7.28 ఎకానమీతో కీలక సమయాల్లో వికెట్లు తీసి చెన్నైని విజేతగా నిలపడంలో ప్రధాన పాత్ర పోషించాడు. మరో రెండు నెలలకే అతనికి భారత జట్టులో చోటు దక్కడం, ఇప్పుడు ప్రపంచ రికార్డు సాధించడం వరకు మిగతా వన్నీ అతని ఐపీఎల్‌ ప్రదర్శనకు కొనసాగింపు లాంటివే. రంజీ ఆటలో ఇన్నింగ్స్‌లో 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. రాజస్తాన్‌ తరఫున 18 ఏళ్ల  చాహర్‌ బరిలోకి దిగగా, 21 పరుగులకే ఆలౌటై రంజీల్లో అతి చెత్త రికార్డు నమోదు చేసిన ఆ జట్టు హైదరాబాద్‌. అంతటి అద్భుత ఆరంభం తర్వాత కూడా అంతర్జాతీయ క్రికెటర్‌ అనిపించుకోవడానికి చాహర్‌కు ఎనిమిదేళ్లు పట్టింది.  గాయాలు అతడిని ఇబ్బంది పెట్టాయి. రాజస్తాన్‌ క్రికెట్‌ జట్...

కాకతీయం పారిశ్రామిక నగరం 

చిత్రం
వరంగల్ జిల్లాకు మహర్దశ పట్టబోతున్నది. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్రం మీదుగా వెళ్తున్న ముఖ్యమైన జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట అందుబాటులో ఉన్న వనరులు, అవకాశాలను జోడించి పారిశ్రామిక అభివృద్ధి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2014 నూతన పారిశ్రామిక విధానంలో ఆరు ఇండస్ట్రియల్‌ కారిడార్ల అభివృద్ధిని పరిశ్రమల శాఖ ప్రతిపాదించింది. వీటిలో ఇండస్ట్రియల్‌ క్లస్టర్లు   ఏర్పాటు చేయడం ద్వారా పెట్టుబడులు ఆకర్షించి, జిల్లా ల్లోనూ ఉపాధి అవకాశాలు పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రతిపాదనలో భాగంగా హైదరాబాద్‌–వరంగల్, హైదరాబాద్‌–నాగ్‌పూర్, హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–మంచిర్యాల, హైదరాబాద్‌–నల్లగొండ, హైదరాబాద్‌–ఖమ్మం ఇండస్ట్రియల్‌ కారిడార్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పారిశ్రామిక కారిడార్ల ద్వారా ఆయా జిల్లాల్లో లభ్యమయ్యే సహజన వనరుల ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. అయితే తొలి దశలో వరంగల్, నాగ్‌పూర్, బెంగళూరు కారిడార్ల అభివృద్ది చేయాలని, మరో మూడు కారిడార్లను రెండో దశలో అభివృద్ధి చేయాలని నూతన పారిశ్రామిక విధానం లో పేర్కొన్నారు. హైదరాబాద్‌–వరంగల్‌ ఇండస్...

ప్రతిష్టంభన యథాతథం..ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం

చిత్రం
రాజకీయం అంటే ఏమిటో, అది చేసే మాయాజాలం ఎలా ఉంటుందో చూడాలంటే మొదటగా మారాతను చూసి తీరాల్సిందే. తెలుగు సినిమాలు, సీరియల్స్ ను తలదన్నేలా రోజుకో ట్విస్టులతో మాహా ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ బోతోందని, ‘మహా’ ఉత్కంఠకు తెర పడనుందని అంతా భావించారు. నాటకీయ పరిణామాలు, అనూహ్య మలుపులు..ఉత్కంఠను పెంచాయి. మద్దతు లేఖ ఇవ్వకుండా కాంగ్రెస్‌ ఆఖరి నిమిషంలో ఇచ్చిన ట్విస్ట్‌తో శివసేన కంగుతిని, అధికారానికి అడుగు దూరంలో నిలిచి పోయింది. మరో 48 గంటలు గడువు ఇచ్చేందుకు గవర్నర్‌ కోష్యారీ నిరాకరించడంతో రాజ్‌భవన్‌ నుంచి శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే బృందం నిరాశగా వెను తిరిగింది. ప్రభుత్వ ఏర్పాటు రేసులో ఎన్సీపీ ముందుకు వచ్చింది. ఎన్సీపీని గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. స్పందించేందుకు 24 గంటల గడువు విధించారు. దీంతో ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనలు ఏం చేయ బోతున్నాయన్నది సస్పెన్స్‌గా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధమై, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతు కోరిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చర్చలు కొనసాగాయి. తొలుత పార్టీ చీఫ్‌ సోనియా నేతృత్వ...

ఆంగ్ల మాధ్యమం..అభివృద్ధికి సోపానం

చిత్రం
ఆంగ్లం అన్నది అదేదో పెనుభూతం అని అనుకోవద్దు. ప్రపంచంలో మనం రాణించాలంటే ఇంగ్లిష్ నేర్చు కోవడం తప్పనిసరి. దీనిని తప్పుగా అర్థం చేసుకోకండి. అలా అని తెలుగు భాషకు మొదటి ప్రాధాన్యతను ప్రభుత్వం ఇస్తుందని స్పష్టం చేశారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి. మన పిల్లలు కూడా గొప్ప పాఠశాలల్లో ఇంగ్లిష్‌  మీడియంలో చదవాలని ఆరాటపడి వారం క్రితం జీఓ విడుదల చేయగానే, ఏం జరుగుతోందో మనందరం చూస్తున్నామని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పేదవారికి ఇంగ్లిష్‌ మీడియం ఎందుకని, తెలుగు మీడియం చాలదా అనే స్వరాలు వినిపిస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న వారిని ఉద్దేశించి ఆయన అన్నారు. విజయవాడలో ఆజాద్‌ 132వ జయంతి సందర్భంగా జాతీయ విద్యా, మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో సీఎం మాట్లాడారు. దేశ తొలి విద్యా మంత్రిగా ఎనలేని సేవలందించిన ఆజాద్‌ జయంతిని, అప్పట్లో మహానేత వైఎస్సార్‌ 2008లో అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవంగా ప్రకటించారని జగన్‌ గుర్తు చేశారు. మౌలానా11 ఏళ్ల పాటు  ఎన్నో మంచి పనులు చేశారని, నేడు ఉన్న పలు విద్యా సంస్థలు ఆయన ప్రారంభించిన వేనని తెలిపారు. నా సుదీర...

భగీరథ అద్భుతం..ఇక దేశ వ్యాప్తం

చిత్రం
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకానికి కేంద్ర సర్కార్ ప్రసంశలు కురిపించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రభుత్వ కృషిని కొనియాడారు. అంతే కాదు ఇదే పథకాన్ని దేశమంతటా విస్తరించేలా చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత అని, ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో మంచి నీటి పథకాలు అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మంచినీటి పథకాలు అమలు చేయడంతోపాటు, మురుగు నీటిని ట్రీట్‌ చేసి ఆ నీళ్లను వ్యవసాయ, గృహోప యోగానికి ఉపయోగించే విధానాలు అవలంబించాలని కేంద్ర మంత్రి సూచించారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం గురించి షెకావత్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర అధికారులు మిషన్‌ భగీరథ స్వరూపాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో 24 వేల ఆవాస ప్రాంతాలకు ప్రతి రోజూ మంచి నీరు అందించేందుకు మిషన్‌ భగీరథ పథకం చేపట్టాం. రాష్ట్రంలో చాలా చోట్ల మ...

ఢీకొన్న రైళ్లు..హాహాకారాలు..బాధితుల కేకలు

చిత్రం
ఘోర ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. కానీ అడుగడుగునా రైల్వే శాఖాధికారుల బాధ్యతా రాహిత్యం అగుపించింది. రైళ్ల రాక పోకలతో రద్దీగా ఉండే హైదరాబాద్‌ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి. కర్నూలు, సికింద్రాబాద్‌ హంద్రీ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలును లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళుతున్న ఎంఎంటీఎస్‌ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది గాయ పడ్డారు. స్టేషన్‌ కావడం, వేగం తక్కువగా ఉండడంతో అతి పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం చిన్నదే అయినా, దీనిని భారీ తప్పిదంగానే రైల్వే భావిస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలుసు కునేందుకు దక్షిణ మధ్య రైల్వేకు చెందిన రైల్వే సేఫ్టీ కమిషనర్‌ రాంక్రిపాల్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ దర్యాప్తు చేపట్టనుంది. కాగా కాచిగూడ స్టేషన్‌లోకి లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్‌ రైలు రెండో నంబర్‌ ప్లాట్‌ ఫామ్‌ పైకి వచ్చి ఆగింది. ప్రయాణికులు దిగి పోయిన తర్వాత సిగ్నల్‌ కోసం ఎదురు చూస్తోంది. అంతకు ముందే కర్నూలు టౌన్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప...

సమ్మె సహజం..విరుద్ధమని ప్రకటించ లేం

చిత్రం
ఆర్టీసీ కథ మళ్ళీ మొదటికి వచ్చింది. కార్మిక సంఘాల సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటించ లేమని, అది తమ పరిధిలోని వ్యవహారం కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం పరిధిలోకి ఆర్టీసీ రాదని స్పష్టం చేసింది. ఆర్టీసీ ప్రజో పయోగ సర్వీసుల పరిధిలోకి వస్తుందని, ఒకవేళ ఎస్మా కింద చర్యలు తీసు కోవాలంటే ఆర్టీసీని అత్యవసర సేవల పరిధిలోకి తీసుకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సమస్య పరిష్కారానికి చర్చలు జరపాలని పలుమార్లు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలను కోరామని, ఏ ఒక్కరూ పంతాన్ని వీడి సమస్య పరిష్కారానికి మెట్టు దిగ రావడానికి ఇష్ట పడనప్పుడు తాము చేయగ లిగిందేమీ లేదంది. చర్చల అంశం ముగిసిందని, దానిపై ఇక చర్చ అవసరం లేదని పేర్కొంది. చర్చలు జరపాలంటూ ఇకపై తాము ఎవరినీ కోరబోమని, ఈ వ్యవహారాన్ని చట్ట పరిధిలోనే తేలుస్తామంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై ధర్మాసనం విచారణ కొనసాగించింది. కార్మిక సంఘాల తరఫున సీనియ...

దివి కేగిన దిగ్గజం

చిత్రం
అధికారం ఉన్నది ప్రజల కోసమేనని చాటి చెప్పిన ధీశాలి టీ.ఎన్.సెషన్ ఇక లేరు. కోట్లాది మంది ప్రజలకు ఎన్నికలు అంటే ఏమిటో, దాని వెనుక ఉన్న పవర్ ఏమిటో తెలియ చెప్పిన ఇలాంటి అధికారి మళ్ళీ రారు. దేశ ఎన్నికల ముఖ చిత్రంపై తన దైన ముద్ర వేశారు. కీలక సంస్కరణలకు ఆద్యుడిగా పేరు పొందిన, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ తిరు నెల్లయ్‌ నారాయణ అయ్యర్‌ శేషన్‌ కన్ను మూశారు. వృద్ధాప్యం కారణంగా కొన్నేళ్లుగా ఇంటికే పరిమితమైన ఆయన చెన్నైలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. తమిళనాడు కేడర్‌కు చెందిన 1955 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన శేషన్‌ 1990–96 సంవత్సరాల్లో 10వ సీఈసీగా పనిచేశారు. కేరళలోని పాలక్కాడ్‌లోని తిరునెల్లయ్‌లో 1932లో జన్మించారు. మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి, అక్కడే డెమాన్‌స్ట్రేటర్‌గా మూడేళ్ల పాటు పని చేసి, ఆ సమయంలోనే ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అనంతరం హార్వర్డ్‌ వర్సిటీలో 1968లో ప్రభుత్వ పాలనలో పీజీ చేశారు. తమిళనాడుతో పాటు, కేంద్ర ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. సీఈసీకి ముందు ఆయన అత్యంత కీలకమైన కేబినెట్‌ సెక్రటరీగా, ప్రణాళికా సంఘం సభ్యునిగా కూడా ఉన్నారు. ...

ఆర్టీసీ కార్మికులకు ఎన్‌ఆర్‌ఐల అండ

చిత్రం
ఆర్టీసీ కార్మికులకు యూకే తెలంగాణా ఐక్య వేదిక అఖిల పక్షం తమ సంపూర్ణ మద్దతు తెలిపింది. లండన్‌లోని కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ, వైఎస్సార్‌సీపీ, తెలంగాణ జన సమితి, టీడీపీ, జనసేన అభిమానులు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్‌ అధ్యక్షులు కోదండ రాం, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, మాజీ మంత్రి డీకే  అరుణ, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి వారి సందేశాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇచ్చారు. లండన్ తరహాలో అన్ని దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలు ఆర్టీసీకి మద్దతు తెలపాలని పిలుపు ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులకు లండన్ ఎన్‌ఆర్‌ఐల మద్దతు స్ఫూర్తితో మిగిలిన దేశాల్లో నివసిస్తున్నవారు మద్దతు ఇవ్వాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. విదేశాల్లో తెలంగాణ ఉద్యమం చేసిన ఎన్‌ఆర్‌ఐలు తెలంగాణలో కష్ట కాలంలో మౌనం వహించడం తప్పన్నారు. సామాజిక బాధ్యతతో ఎన్‌ఆర్‌ఐలు తమ అభిప్రాయాలను చెప్పి ప్రభుత్వం పరిష్కారం తీసుకునేలా చొరవ తీసుకునే విధంగా ఒత్తిడి తేవాలని కోరారు. నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. లండన్ తరహ...

దీపక్ దెబ్బకు ఠారెత్తిన బంగ్లా

చిత్రం
యువ పేసర్‌ దీపక్‌ చాహర్‌ టీ20ల్లోనే అత్యుత్తమ బౌలింగ్‌తో సంచలనం సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 7 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. హ్యాట్రిక్‌ సహా ఆరు వికెట్లతో విజృంభించడంతో భారత్‌ చివరి టీ20లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. బంగ్లాను 30 పరుగుల తేడాతో ఓడించి మూడు టీ20ల సిరీ్‌సను 2-1తో కైవసం చేసుకుంది. శ్రేయాస్‌ అయ్యర్‌ 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 ధనాధన్‌ ఇన్నింగ్స్‌తోపాటు కేఎల్‌ రాహుల్‌  7 ఫోర్లతో 52 పరుగులతో రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. సౌమ్యా సర్కార్‌, షఫియుల్‌ చెరో రెండు వికెట్లు పడ గొట్టారు. ఛేదనలో దీపక్‌ చాహర్‌ నిప్పులు చెరగడంతో బంగ్లాదేశ్‌ 19.2 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ మహమ్మద్‌ నయీమ్‌ 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులు చేసినా ఫలితం లేక పోయింది. ఈ మ్యాచ్‌లో క్రునాల్‌ పాండ్యా స్థానంలో మనీష్‌ పాండేను టీమ్‌లోకి తీసుకున్నారు. అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టిన దీపక్‌ చాహర్‌కు మ్యాచ్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది. లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు దీపక్‌ చాహర్‌ ...

రండి రండి దయ చేయండి

చిత్రం
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సరి పడా సంఖ్యా బలం లేదని, సంప్రదింపులు జరిపేందుకు మూడ్రోజుల సమయం ఇవ్వాలన్న శివసేన అభ్యర్థనను తిరస్కరించిన కాసేపటికే గవర్నర్ భగత్ సింగ్ కోషియారి మరో కీలక నిర్ణయం తీసు కున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఎన్సీపీని ఆహ్వానించారు. ఇందు కోసం 24 గంటల గడువిచ్చారు. దీంతో ఎన్సీపీ నేత అజిత్ పవార్ తమ పార్టీకి చెందిన మరి కొందరు నేతలతో గవర్నర్‌ను కలిశారు. 288 స్థానాలున్న మహారాష్ట్రలో అధికారం చేపట్టేందుకు 145 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. సేనకు 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ పార్టీ 44 ఎమ్మెల్యేలు వున్నారు. ఇతరులు 29 మంది ఉన్నారు. వాస్తవానికి బీజేపీ, శివసేన సంకీర్ణంగా మారి ఎన్నికల్లో పోటీ చేశాయి. బీజేపీ గెలిచిన 105  మంది ఎమ్మెల్యేలతో పాటు శివసేన గెలిచిన 56 మంది ఎమ్మెల్యేలతో కలిపితే మ్యాజిక్ నెంబర్ 145 సులభంగా దాటే వారే. సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వారే. అయితే వచ్చింది 56 స్థానాలే అయినా సీఎం పీఠంపై కూర్చోవాలని శివసేన అధిష్టానం కలలు కన్నది. కుమార రత్నం ఆదిత్యను సీఎం చేయాలని ఉద్ధవ్ తహ తహ లాడారు. అయితే కాంగ్రెస్, ఎన్సీపీ షాకివ్వడంతో బిత్తర పోయారు. మరో ...

అంబానీకి కోలుకోలేని షాక్

చిత్రం
ఇచ్చిన రుణాన్ని వసూలు చేసుకునే నిమిత్తం చైనాకు చెందిన మూడు బ్యాంకులు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీని లండన్‌ కోర్టుకు లాగాయి. కంపెనీ నుంచి ఈ బ్యాంకులకు ఇంకా 68 కోట్ల డాలర్లు రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు ఇండస్ర్టియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా లిమిటెడ్‌, చైనా డెవల్‌పమెంట్‌ బ్యాంకు, ఎక్స్‌పోర్ట్‌, ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనాలు కోర్టును ఆశ్రయించాయి. ఆర్‌కామ్‌కు 92.52 కోట్ల డాలర్ల రుణం ఇచ్చేందుకు ఈ మూడు బ్యాంకులు 2012 సంవత్సరంలో అంగీకరించాయి. అయితే అనిల్‌ అంబానీ వ్యక్తిగత హామీతోనే రుణం ఇచ్చినట్టు బ్యాంకులు చెబుతున్నాయి. ఇచ్చిన రుణంలో కొంత మొత్తాన్ని కంపెనీ ఇప్పటికే చెల్లించగా, మిగతా మొత్తాన్ని చెల్లించలేదు. 2017 ఫిబ్రవరిలో ఈ రుణం డీఫాల్ట్‌గా మారింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు రుణ వసూళ్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ రుణానికి వ్యక్తిగతంగా హామీ ఇవ్వలేదని అనిల్‌ అంబానీ తరఫున న్యాయవాది అంటున్నారు. రిలయన్స్‌ కమర్షియల్‌ అండ్‌ ట్రెజరీ హెడ్‌ హసిత్‌ శుక్లా అనిల్‌ అంబానీ తరఫున వ్యక్తిగత హామీపై సంతకం చేశారని, బ్యాంకుల తరఫు న్యాయవాది కోర్టుకు...

మొబైల్ లవర్స్ కు భలే ఆఫర్స్

చిత్రం
 ఇండియన్ మార్కెట్ లో ఇప్పుడు మొబైల్స్ హవా నడుస్తోంది. లెక్కలేనన్ని ఆఫర్స్ తో పాటు కళ్ళు చెదిరేలా బహుమతులు ఇస్తుండడంతో స్మార్ట్ ఫోన్స్ యూసర్లు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. అటు ఆఫ్ లైన్ లో ఇటు ఆన్ లైన్ లో లెక్కకు మించి వాటిని తీసేసుకుంటున్నారు. ఇప్పటికే దిగ్గజ మొబైల్స్ కంపెనీలకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చాయి చైనాకు చెందిన షావోమి, లెనోవో, మోటరోలా, వివో కంపెనీలు. అమ్మకాల్లో ఐదో ప్లేస్ లో ఉన్న చైనా మొబైల్ కంపెనీ వివో తాజగా ఐదేళ్లు ముచ్చటగా పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా  వినియోగ దారులకు ఆఫర్లు ప్రకటించింది. క్యాష్‌బ్యాక్ డీల్స్, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, ఉచిత యాక్సెసరీలు వంటి మరెన్నో ఆఫర్లను ఇవ్వనున్నట్లు తెలిపింది. వివో వి, ఎస్, వై సిరీస్‌లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్‌కార్డులపై కొనుగోలు చేసే వారికి 10 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుందని, అలాగే, జీరో డౌన్ పేమెంట్‌తో నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉందని వెల్లడించింది. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ వినియోగదారులకు అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తున్నట్టు పేర్కొంది. ఈ ఆఫర్లతో పాటు...

పీఠంపై వీడని పీటముడి

చిత్రం
మరాఠాలో ఇంకా రాజకీయ గందరగోళం కొనసాగుతూనే ఉన్నది. రోజు రోజుకు పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చేతులెత్తేసింది. దీంతో రెండో అతి పెద్ద సంఖ్యా బలం కలిగిన శివసేన పార్టీని సర్కార్ ఏర్పాటుకు రాష్ట్ర గవర్నర్ ఆహ్వానం పలికారు. దీంతో మరింత టెన్షన్ నెలకొంది. కనీసం మరో 48 గంటల సమయం కావాలని శివసేన చీఫ్ కోరారు. దీనికి గవర్నర్ డోంట్ కేర్ అని స్పష్టం చేశారు. నిన్నటి దాకా బీజేపీ, శివసేన పార్టీలు ఎన్నికల్లో పోటీ చేశాయి. చివరకు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లేక పోవడంతో ఎవరు కొలువు తీరుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చకచకా పావులు కదుపుతుండగా, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఇంకా మీన మేషాలు లెక్క పెడుతోంది. శివసేనకు మద్దతు ఇవ్వాలా వద్దా అన్నది ఇంకా తేల్చు కోలేక పోతోంది. బయటి నుంచి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్టు కథనాలు వచ్చాయి. అయితే, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఈ విషయంలో మరిన్ని సంప్రదింపులు అవసరమని, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో చర్చించిన మీదటే, తుది నిర్ణయం తీసుకుంటామన...