పీఠంపై వీడని పీటముడి

మరాఠాలో ఇంకా రాజకీయ గందరగోళం కొనసాగుతూనే ఉన్నది. రోజు రోజుకు పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చేతులెత్తేసింది. దీంతో రెండో అతి పెద్ద సంఖ్యా బలం కలిగిన శివసేన పార్టీని సర్కార్ ఏర్పాటుకు రాష్ట్ర గవర్నర్ ఆహ్వానం పలికారు. దీంతో మరింత టెన్షన్ నెలకొంది. కనీసం మరో 48 గంటల సమయం కావాలని శివసేన చీఫ్ కోరారు. దీనికి గవర్నర్ డోంట్ కేర్ అని స్పష్టం చేశారు. నిన్నటి దాకా బీజేపీ, శివసేన పార్టీలు ఎన్నికల్లో పోటీ చేశాయి. చివరకు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లేక పోవడంతో ఎవరు కొలువు తీరుతారో తెలియని పరిస్థితి నెలకొంది.

ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చకచకా పావులు కదుపుతుండగా, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఇంకా మీన మేషాలు లెక్క పెడుతోంది. శివసేనకు మద్దతు ఇవ్వాలా వద్దా అన్నది ఇంకా తేల్చు కోలేక పోతోంది. బయటి నుంచి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్టు కథనాలు వచ్చాయి. అయితే, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఈ విషయంలో మరిన్ని సంప్రదింపులు అవసరమని, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో చర్చించిన మీదటే, తుది నిర్ణయం తీసుకుంటామని అధికారికంగా ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రభుత్వ ఏర్పాటుకు ఉవ్విళ్లూరుతున్న శివసేనకు ఈ మేరకు ట్విస్ట్‌ ఇచ్చింది. అంతకు ముందు సోనియా గాంధీ నివాసంలో పార్టీ అగ్ర నాయకులు భేటీ అయి, మహారాష్ట్ర పరిణామాలు, శివసేన సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతునిచ్చే అంశంపై చర్చించారు. ఈ భేటీలో ఏకే ఆంథోని, అహ్మద్‌ పటేల్‌ వంటి అగ్రనేతలు పాల్గొన్నారు. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే సోనియా గాంధీకి ఫోన్‌ చేసి మాట్లాడినట్టు సమాచారం. మహారాష్ట్ర పరిణామాలపై సీడబ్ల్యూసీ సుదీర్ఘంగా చర్చించిందని, ఈ విషయంలో శరద్‌ పవార్‌తో చర్చించిన అనంతరమే నిర్ణయం తీసుకుంటామని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది.

మరో వైపు గవర్నర్‌ ఆహ్వానం మేరకు శివసేన నేతలు ఆదిత్య ఠాక్రే, ఏక్‌నాథ్‌ షిండే రాజ్‌భవన్‌ చేరుకున్నారు. గవర్నర్‌ను కలిసి వారి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. ఇక, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమిపై బీజేపీ చిటపట లాడుతోంది. ఒకప్పుడు బాబా సాహెబ్‌ సేనగా ఉన్న శివసేన ఇప్పుడు సోనియా సేనగా మారి పోయిందంటూ బీజేపీ నేత మినాక్షి లేఖి ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కామెంట్‌లు