హెవీ డిమాండ్..పీకే కు పెరిగిన క్రేజ్
ఆసియాలో మోస్ట్ ఫెవరబుల్ పర్సన్ గా పేరు తెచ్చుకున్నారు ప్రశాంత్ కిషోర్. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఇండియాలో టాప్ పొజిషన్లో కొనసాగుతున్నారు. ఆయన అపాయింట్ మెంట్ కోసం ఎందరో తలపండిన రాజకీయ నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలు వెయిట్ చేస్తున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు పీకే స్టామినా ఏమిటో. ఇప్పటికే ఆయన ఎవరితోనైనా చేతులు కలిపారంటే ఇక విజయం సిద్దించినట్లే. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి కి వెన్నుదన్నుగా ఉన్నారు. ఆయన విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటి దాకా పవన్ కళ్యాణ్, చంద్ర బాబు నాయుడు తో పాటు మమతా బెనర్జీ, మాయావతి, తదితర దిగ్గజాలు టచ్ లో ఉన్నారు.
ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బెంగాల్ దీదీ తో రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. తన ఐడియాస్ ను ఇంప్లిమెంట్ చేసే పనిలో పడ్డారు. తాజగా ఆయన దృష్టి తమిళనాడుపై పడింది అన్నది వైరల్ గా మారింది. అక్కడ పాలిటిక్స్ ఎక్కువగా సినీ రంగంతో ముడిపడి ఉంటాయి. ఇప్పటికే సూపర్ స్టార్ రజని కాంత్, కమల్ హాసన్, కుష్బూ , శరత్ కుమార్, విశాల్ రెడ్డి తో పాటు తాజాగా ఎనర్జటిక్ స్టార్ విజయ్ కూడా చేరి పోయాడు. ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ ..విజయ్ తో బీట్ అయినట్టు సమాచారం. కొద్దిగా కష్టపడితే సీఎం ఖుర్చీ అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పినట్టు తెలిసింది.
పీకే గతంలో ప్రధాని నరేంద్ర మోదీకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌లకు రాజకీయ వ్యూహకర్తగా పని చేశారు. దీంతో ప్రశాంత్ కిషోర్ పేరు తమిళనాడుకు కూడా పాకింది. అక్కడ 2021లో శాసనసభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో తమిళపాడులోని పలు రాజకీయ పార్టీలు ప్రశాంత్ కిషోర్‌ను వ్యూహకర్తగా నియమించు కోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈయన మక్కళ్ నీది మయ్యం పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్‌కు మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌కు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినట్లు ప్రచారం జరిగింది.
పార్టీ విధానం విషయంలో ప్రశాంత్ కిషోర్ నిర్ణయాలను కమలహాసన్ విభేదించడమే అందుకు కారణం అని తెలిసింది. దీంతో ప్రశాంత్ కిషోర్‌తో మక్కళ్ నీది మయ్యం ఒప్పందం రద్దు కానున్నట్లు సమాచారం. కాగా త్వరలో రాజకీయ రంగప్రవేశం చేయడానికి సిద్ధం అవుతున్న రజనీకాంత్ కూడా తనకు రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను నియమించు కోవాలను భావిస్తున్నట్లు, వీరిద్దరి మధ్య ముంబాయిలో భేటీ కూడా జరిగినట్లు ప్రచారం జరిగింది. మరో వైపు రైజింగ్ స్టార్ విజయతో ముచ్చట ఇప్పుడు తమిళ నాట హాట్ టాపిక్ గా మారింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి