అంబానీకి కోలుకోలేని షాక్
ఇచ్చిన రుణాన్ని వసూలు చేసుకునే నిమిత్తం చైనాకు చెందిన మూడు బ్యాంకులు రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీని లండన్ కోర్టుకు లాగాయి. కంపెనీ నుంచి ఈ బ్యాంకులకు ఇంకా 68 కోట్ల డాలర్లు రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు ఇండస్ర్టియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్, చైనా డెవల్‌పమెంట్ బ్యాంకు, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ చైనాలు కోర్టును ఆశ్రయించాయి. ఆర్‌కామ్‌కు 92.52 కోట్ల డాలర్ల రుణం ఇచ్చేందుకు ఈ మూడు బ్యాంకులు 2012 సంవత్సరంలో అంగీకరించాయి.
అయితే అనిల్ అంబానీ వ్యక్తిగత హామీతోనే రుణం ఇచ్చినట్టు బ్యాంకులు చెబుతున్నాయి. ఇచ్చిన రుణంలో కొంత మొత్తాన్ని కంపెనీ ఇప్పటికే చెల్లించగా, మిగతా మొత్తాన్ని చెల్లించలేదు. 2017 ఫిబ్రవరిలో ఈ రుణం డీఫాల్ట్‌గా మారింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు రుణ వసూళ్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ రుణానికి వ్యక్తిగతంగా హామీ ఇవ్వలేదని అనిల్ అంబానీ తరఫున న్యాయవాది అంటున్నారు.
రిలయన్స్ కమర్షియల్ అండ్ ట్రెజరీ హెడ్ హసిత్ శుక్లా అనిల్ అంబానీ తరఫున వ్యక్తిగత హామీపై సంతకం చేశారని, బ్యాంకుల తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. శుక్లాకు సంతకం చేసే అనుమతి గానీ, అధికారం గానీ అనిల్ అంబానీ ఇవ్వ లేదని, దీని మూలంగా ఆ హామీ నాన్ బైండింగ్ కిందకు వస్తుందని అనిల్ అంబానీ తరఫు న్యాయవాది వాదించారు. మొత్తం మీద రిలయన్స్ కంపెనీల మీద పలు ఆరోపణలు వస్తున్నా వాటిని ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు ఇద్దరు అన్నదమ్ములు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి