మనీ వద్దు..మీ అభిమానం చాలు
బిగ్ బాస్ రియాల్టీ షోతో టాప్ రేంజ్ లోకి చేరుకున్న యాంకర్ శ్రీముఖి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. అవార్డు, మనీ నాకేమీ వద్దు. మీ ఆదరాభిమానాలు నాకు చాలు అని ఈ ముద్దుగుమ్మ తెలిపింది. అయితే నిజమైన విజేత మాత్రం బాబా భాస్కర్ అని కుండా బద్దలు కొట్టింది. అయితే విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అయినా.. ప్రేక్షకుల మనసు గెలిచింది మాత్రం బుల్లితెర రాములమ్మే నంటూ శ్రీముఖి అభిమానులు చెప్పుకొచ్చారు. బిగ్‌బాస్ పూర్తవగానే మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేసింది. ఈ క్రమంలో అభిమానులతో మొదటిసారి లైవ్‌లోకి వచ్చింది. ఈ సందర్భంగా బిగ్‌బాస్ షో గురించి పలు ఆసక్తికర అంశాలను పంచుకుంది.
తనకు ఎంతగానో మద్దతు తెలిపిన ఝాన్సీ, రష్మీ, ముక్కు అవినాష్, ఆటో రాంప్రసాద్‌లకు కృతజ్ఞతలు తెలిపింది. నామినేషన్‌లోకి వచ్చినప్పుడు భయపడ లేదని, ఎందుకంటే తానే తప్పూ చేయలేదని, పైగా అభిమానులు సేవ్ చేస్తారన్న నమ్మకముండేదని చెప్పుకొచ్చింది. ట్రెడిషనల్‌గా, మోడ్రన్‌గా, మేకప్‌తో, మేకప్ లేకుండా అన్ని రకాలుగా చూశారు. నన్ను మీ ఇంట్లో అమ్మాయిగా ఆదరించారు. నువ్వే మాకు రియల్ విన్నర్ అని చాలా విషెస్ వచ్చాయి. ఏవీ నాకు వద్దు.. మీ ప్రేమ నాకు చాలు. బిగ్‌బాస్ షో తర్వాత ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. పటాస్‌కు వస్తానో లేదో ఓ వారం తర్వాత చెప్తాను. కాస్త విశ్రాంతి తీసుకుంటున్నా. వారంలోనే షూటింగ్‌కు వచ్చేస్తా. ఇకనుంచి మీరు గర్వపడే షోలు చేస్తానని శ్రీముఖి మాటిచ్చింది.
బిగ్‌బాస్‌లో మరిచి పోలేనిది మా అమ్మ, తమ్ముడు వచ్చిన సందర్భం. ఇంకా బాబాతో నా పరిచయం. అతని నుంచి చాలా నేర్చుకున్నాను. బిగ్‌బాస్‌లో ఇటుకల టాస్క్ బాగా ఎంజాయ్ చేశాను. బాబా భాస్కర్ అసలైన విన్నర్. టాస్క్‌ల్లోనూ, వండి పెట్టడంలోనూ, అతని ప్రవర్తన, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ కలిపి అతనే విజేత. బాబా తర్వాత తమన్నా సింహాద్రి ఇష్టం. రాహుల్ నా ఫ్రెండ్. పరిస్థితుల వల్ల మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. బిగ్‌బాస్‌లో జరిగినవి అక్కడే వదిలేశా. హిమజ, హేమ తన గురించి నెగెటివ్‌గా మాట్లాడిన కామెంట్‌లపై కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదని కరాఖండిగా చెప్పేసింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి