రండి రండి దయ చేయండి
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సరి పడా సంఖ్యా బలం లేదని, సంప్రదింపులు జరిపేందుకు మూడ్రోజుల సమయం ఇవ్వాలన్న శివసేన అభ్యర్థనను తిరస్కరించిన కాసేపటికే గవర్నర్ భగత్ సింగ్ కోషియారి మరో కీలక నిర్ణయం తీసు కున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఎన్సీపీని ఆహ్వానించారు. ఇందు కోసం 24 గంటల గడువిచ్చారు. దీంతో ఎన్సీపీ నేత అజిత్ పవార్ తమ పార్టీకి చెందిన మరి కొందరు నేతలతో గవర్నర్‌ను కలిశారు. 288 స్థానాలున్న మహారాష్ట్రలో అధికారం చేపట్టేందుకు 145 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి.
సేనకు 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ పార్టీ 44 ఎమ్మెల్యేలు వున్నారు. ఇతరులు 29 మంది ఉన్నారు. వాస్తవానికి బీజేపీ, శివసేన సంకీర్ణంగా మారి ఎన్నికల్లో పోటీ చేశాయి. బీజేపీ గెలిచిన 105 మంది ఎమ్మెల్యేలతో పాటు శివసేన గెలిచిన 56 మంది ఎమ్మెల్యేలతో కలిపితే మ్యాజిక్ నెంబర్ 145 సులభంగా దాటే వారే. సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వారే. అయితే వచ్చింది 56 స్థానాలే అయినా సీఎం పీఠంపై కూర్చోవాలని శివసేన అధిష్టానం కలలు కన్నది. కుమార రత్నం ఆదిత్యను సీఎం చేయాలని ఉద్ధవ్ తహ తహ లాడారు.
అయితే కాంగ్రెస్, ఎన్సీపీ షాకివ్వడంతో బిత్తర పోయారు. మరో వైపు బీజేపీ శివ సేనకు కటీఫ్ చెప్పేసింది. ఇదే సమయంలో శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే సోనియా గాంధీతో మాట్లాడారు. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే సోనియా మాత్రం తెలివిని ప్రదర్శించింది. ఎన్సీపీని సంప్రదించక చెబుతామంటూ దాట వేసింది. దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. మొత్తం మీద మరాఠా పాలిటిక్స్ రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి