భవిష్యత్తు ఆవసరం.. గతం కాదనలేం..స్పష్టం చేసిన ధర్మాసనం..!

గత కొంత కాలంగా రాష్ట్ర సర్కారుకు హైకోర్టు లో ప్రతిదీ చుక్కెదురవుతోంది. తాజాగా ఎర్రమంజిల్ ను కూల్చాలన్న ప్రతిపాదనను విరమించు కోవాలని ధర్మాసనం స్పష్టమైన తీర్పు చెప్పింది. రూల్స్ ను, ఆదేశాలను ఎంత మాత్రం ఖాతరు చేయడం లేదంటూ నిలదీసింది. భవిష్యత్తు ముఖ్యమే కాదనలేం, కానీ గతం కూడా అవసరమే ఎందుకంటె గతం అన్నది లేకపోతే ఫ్యూచర్ మరింత అంధకారమవుతుంది. నరుక్కుంటూ పోతే చెట్లు, కూల్చుకుంటూ పోతే కట్టడాలు మిగలవు. ఆనవాళ్లు మాత్రమే మిగిలి పోతాయి. ఇందు కోసం కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది అంటూ మంది పడింది. ఎర్రమంజిల్‌లోని భవనాలను కూల్చి కొత్త గా అసెంబ్లీని కట్టాలనుకున్న ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టి వేస్తూ కీలక తీర్పు వెలువరించింది. కేబినెట్ నిర్ణయం చట్ట పరిధిలో లేదని, ప్రత్యక్షంగా చేయలేని దాన్ని పరోక్షంగా చేసే ప్రయత్నం ఇందులో కనిపించిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. అసెంబ్లీ కోసం హెరిటేజ్ భవనాల్ని కూల్చేస్తే ప్రజల చిరకాల చారిత్రక సంస్కృతులు భూస్థాపితం అవుతాయని పేర్కొంది. కీలకమైన రూల్స్‌ను, ప్రొసీజర్‌ను, హైకోర్టు ఆదేశాలను సర్కారు పట్టించు కోలేదు. అందు...