గాత్ర మాధుర్యానికి అరుదైన గౌరవం..!
సినీ జగత్తులో తన గాత్ర మాధుర్యాన్ని పంచుతూ తనకంటూ ఓ ఇమేజ్ స్వంతం చేసుకున్న గాయకురాలు కె.ఎస్.చిత్రకు అరుదైన పురస్కారం లభించింది. ప్రముఖ, దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు పేరుతో ఏర్పాటు చేసిన స్వర్ణ కంకణం పురస్కారం ఈసారి చిత్రను వరించింది. దేశంలో పేరున్న గాయనీమణుల్లో ఆమె ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో కొన్నేళ్ల పాటు టాప్ పొజిషన్ లో ఉన్నారు. టి. సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో ‘రాగ సప్త స్వరం’ సంస్థ రవీంద్రభారతిలో నిర్వహించే కార్యక్రమంలో చిత్రకు అందజేయనున్నారు. ఇప్పటికే ఎన్నో భాషల్లో చిత్ర తన గాత్ర మాధుర్యంతో అలరించారు. 1963 జూలై 27 కేరళలోని తిరువనంతపురంలో చిత్ర జన్మించారు. ఇప్పుడు ఆమెకు 56 ఏళ్ళు. చిత్ర అసలు పేరు చిత్రా కృష్ణన్ నాయర్. చిత్రకు "దక్షిణ భారత నైటింగేల్" అనే పేరుంది. ఇప్పటి దాకా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ బెంగాలీ భాషలలో వేలాది పాటలు పాడింది.
మొదటి నుంచి సంగీత కారుల కుటుంబం కావడంతో ఆమెకు స్వతహాగా కర్ణాటక సంగీతంపై పట్టు కలిగి ఉన్నది. చిన్నతనంలో ఆమె ప్రతిభను తండ్రి కృష్ణన్ నాయర్ గుర్తించి ప్రోత్సహించాడు. చిత్ర తొలి గురువు ఆమె తండ్రే.1978 నుండి 1984 వరకు కేంద్ర సర్కార్ నేషనల్ టాలెంట్ స్కాలర్ షిప్ పొందింది. ఒమన్ కుట్టి దగ్గర సంగీతంలోని మెళుకువలు నేర్చుకుంది.1979లో ఎం.జి.రాధాకృష్ణన్ మలయాళ సినీ నేపథ్య గానానికి చిత్రను పరిచయం చేశాడు. ఆ తరువాత సంగీత దర్శకుడు ఇళయరాజా నేతృత్వములో ఈమె చెన్నైలోని తమిళ సినిమా రంగములో అడుగు పెట్టింది. సుశీల, జానకి, తదితరులు తమ హవా కొనసాగిస్తున్న సమయంలో మెల్లగా తన వాయిస్ తో జనాన్ని మెస్మరైజ్ చేసింది. తెలుగులో సింగిల్ కార్డు తో ఎన్నో సినిమాలకు చిత్ర ఒక్కరే పాడారు. వందలాది పాటలు తెలుగు వారిని ఇంకా అలరిస్తూనే వున్నాయి. ఇప్పటి వరకు 25 వేలకు పైగా పాటలు పాడారు.
ఎనిమిది ఫిలిం ఫెర్ అవార్డులు పొందారు. 36 స్టేట్ ఫిలిం అవార్డులు అందుకున్నారు చిత్ర. భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. యునైటెడ్ కింగ్ డంలోని బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ తో చిత్రను ఎంపిక చేసింది. భారత దేశం నుంచి ఈ పురస్కారం అందుకున్న ఏకైక గాయని చిత్ర మాత్రమే. చైనా ప్రభుత్వం ఖ్వింఘై ఇంటర్నేషనల్ అవార్డును అందజేసింది. ఎంటీవీ ఆమె పాడిన వీడియో సాంగ్ కు ఉత్తమ గాయనిగా ఎంపిక చేసింది. అమెరికాలో ఆమె ఈ పురస్కారం అందుకున్నారు. అరబ్ ఎమ రేట్స్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ ఆల్ క్వాసిమి పేరుతో ఏర్పాటు చేసిన అవార్డు ను చిత్రకు బహూకరించింది. ముంబై సినిమా కోసం ఆమె పాడిన పాటకు ప్రపంచం ఫిదా అయ్యింది. ఇంగ్లాండ్ గార్డియన్స్ ఎంపిక చేసిన 1000 పాటల్లో చిత్ర పాడిన పాటను కూడా చేర్చింది. ప్రముఖ గాయకుడు ఏసుదాస్ తో కలిసి విదేశాలలో సంగీత కచేరీలలో పాల్గొన్నారు.
జెర్రీ ఆమ్ల దేవ్, రాధా కృష్ణన్ , ఇళయ రాజా , రెహమాన్, రవీంద్రన్, ఎస్ ఫై వెంకటేష్, జాన్సన్ , అర్జునన్, మోహన్ సితార, ఎం.జయచంద్రన్ , రమేష్ నారాయణ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ తో పాడారు. నైటింగేల్ ఆఫ్ కేరళ అవార్డును కేరళ సర్కార్ ప్రకటించింది. అంతే కాకుండా రికార్డ్ స్థాయిలో 16 సార్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకుంది. తమిళంలో ఇళయరాజా ఆమెను పరిచయం చేశాడు. రెహమాన్ ఆమెతో ఎక్కువ సాంగ్స్ పాడించాడు. రాజ్ కుమార్, విద్యాసాగర్, యువన్ శంకర్ రాజా , జీవి ప్రకాష్ కుమార్, హరీష్ జయరాజ్, సంతోష్ నారాయణ్ లతో ఆమె పాటలు పాడారు. కన్నడలో కూడా ఆమె పాడిన పాటలు హిట్టయ్యాయి. ఇదే సమయంలో తెలుగులోకి ఎంటర్ అయ్యారు. వందలాది సినిమాలలో ఆమె గుర్తుంచుకోదగిన సాంగ్స్ పాడారు. చిత్ర ఎస్పీ బాలసుబ్రమణ్యం, శ్రీకుమార్, ఏసుదాస్, మనో, హరిహరన్, ఉదిత్ నారాయణ్, కుమార్ సాను, రాజేష్ కృష్ణన్, ఉన్ని కృష్ణన్, శంకర్ మహదేవన్, విజయ్ యేసు దాస్ లతో కలిసి పాడారు.
సుశీల, వాణి జయరాం, జానకి, శైలజ, సుజాత మోహన్, శ్రేయ గోషాల్ , శ్వేతా మోహన్, స్వర్ణలత, సాధన సర్గం , హరిణి, సునిధి చౌహన్ , అల్కా యాగ్నిక్, మధుశ్రీ , సునీత లతో కలిసి ఆమె తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ఎక్కువగా పాడారు. అన్నటికంటే చిత్ర బాలుతో కలిసి పాడిన పాటలే ఎక్కువగా ఉన్నాయి. రాజ్ కోటి స్వర పరిచిన మూడు వేల పాటలలో చిత్ర తో పాడించిన సాంగ్స్ ఎక్కువగా ఉండడం విశేషం. నిన్నటి తరం మ్యూజిక్ డైరెక్టర్స్ తో పాటు నేటి తరం సంగీత దర్శకులతో పాడారు చిత్ర. సంతోష్ నారాయణ్, ఎస్ ఎస్ థమన్, దేవి శ్రీ ప్రసాద్, మిక్కీ జె మేయర్ , సాయి కార్తీక్ , ఘిబ్రన్ తో పాటలు పదారు. ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ తో కలిసి చిత్ర పాడిన పియా బసంతి ప్రైవేట్ ఆల్బమ్ ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది. మొత్తం చిత్ర కెరీర్ లో 216 అవార్డులు అందుకున్నారు. ఇది ఆమె కెరీర్ లోనే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అన్నమాట.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి