హిందీని రుద్దితే యుద్ధమే..పెత్తనం చెలాయిస్తే అగ్ని గుండమే..?
దేశంలో రెండవ సారి కేంద్రంలో కొలువు దీరిన భారత జాతీయ జనతా పార్టీ తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటుందోనన్న ఆరోపణలు ఎదుర్కుంటోంది. ఓ వైపు ఎన్నడూ లేనంతగా దేశ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దిగజారి పోయింది. ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషించే ప్రధాన రంగాలన్నీ కునారిల్లి పోయాయి. ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. నిరుద్యోగం పెరిగి పోయింది. స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో కాలయాపన చేస్తోంది. నోట్ల రద్దు దెబ్బకు ప్రభుత్వ రంగ బ్యాంకులు పూర్తిగా దివాళా తీసే స్థితికి దగ్గరగా వున్నాయి. ఇదే సమయంలో ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే భాష పేరుతో ఉండాలని మోడీ, అమిత్ షా డిసైడ్ అయ్యారు. తాజాగా జమ్మూ, కాశ్మీర్ విషయంలో 370 ఆర్టికల్ ను రద్దు చేయడంతో బీజేపీ సర్కార్ గ్రాఫ్ ఒక్క సారిగా పెరిగి పోయింది. దేశమంతటా హిందీని తప్పనిసరిగా వాడాలని ఇటీవల కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ చంద్ర షా స్పష్టం చేశారు. దీంతో మాపై బలవంతంగా రుద్దితే ఒప్పుకునే ప్రసక్తి లేదు అంటూ ఆయా రాష్ట్రాలలో ఇప్పటికే మాటలు మంటలు రేపుతున్నాయి.
కేవలం భాష పేరు మీద తమిళనాడు, ఆంద్ర రాష్ట్రాలు ఏర్పాటు అయ్యాయి. భారత రాజ్యాంగంలో ప్రజలు మాట్లాడే భాషలకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని ఆనాడే బాబా సాహెబ్ అంబేద్కర్ స్పష్టం చేశారు. తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ , ప్రముఖ నటుడు కమల్ హాసన్ , పక్షిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని , మా రాష్ట్రం, మా భాష , మా సంస్కృతి, మా నాగరికత మాకు మాత్రమే స్వంతమని, ఇందులో తల దూర్చాలని ప్రయత్నం చేస్తే దేశం అగ్ని గుండమే అవుతుందని హెచ్చరించారు. హిందీ భాషను నేర్చుకుంటే బావుంటుందని చెప్పండి, అంతే కానీ బలవంతంగా దాని పేరుతో పెత్తనం చెలాయిస్తామంటే ఇక యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మండిపడ్డారు. ప్రజలు, సమాజం వారి వారి భాషలో మాట్లాడాలని అనుకుంటారు. అంతే కాకుండా వేరే లాంగ్వేజ్ ను యూజ్ చేస్తే ఏమీ నేర్చుకోలేరు.
ఎందులోనైనా, దేనినైనా సాధించాలన్నా , పట్టు కలిగి ఉండాలన్నా, విజయం పొందాలంటే తమ మాతృ భాషలోనే సాధ్యమవుతుంది. అందుకే దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్షను గుర్తించిన భాషల్లోనే రాసే అవకాశం కల్పించారు. ఈ సమయంలో భాష పేరుతో ఆయా ప్రాంతాలు, రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలని అనుకోవడం మరో తేనె తుట్టను కదిలించినట్టవుతుంది. దీని వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం పొంచి ఉన్నది. సౌత్ ఇండియాలో పాగా వేయాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతున్న కమల దళం, భాషను బలవంతంగా రుద్దాలని అనుకోవడం అంటే, వారి అస్థిత్వంపై దెబ్బ కొట్టినట్లవుతుంది తప్పా ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలుసు కోవాలి. బలం ఉంది కదా అని రుద్దుకుంటూ పోతే ఒక్కోసారి పిల్లులు కూడా పులులవుతాయి. అది చరిత్ర చెప్పిన సత్యం.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి