మోడీ జోష్ .. ట్రంప్ ఖుష్..!

పెద్దన్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు..చిన్నన్న ఇండియా పీఎం నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. దక్షిణాషియా ప్రాంతంలో శాంతి నెలకొల్పే విషయంలో భారతదేశం ఎల్లప్పుడూ ముందే ఉంటుందని మోడీ స్పష్టం చేశారు. యుఎస్ అధ్యక్షుడితో పీఎం ఫోన్ చేసి మాట్లాడారు. వీరిద్దరి మధ్య దాదాపు అరగంటకు పైగా సంభాషణ జరిగింది. ఈ ప్రాంతంలో ఇండియాకు వ్యతిరేకంగా, కొంత మంది నేతలు అవాకులు పేలడం గురించి తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై తమ వాక్ చాతుర్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారి వల్లనే, శాంతి ప్రక్రియకు విఘాతం కలుగుతోందని స్పష్టం చేశారు. సరిహద్దు రేఖల వెంట పేట్రేగిపోతున్న ఉగ్ర మూకలను తుద ముట్టించడంతో పాటు తీవ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలని పిలుపునిచ్చారు. పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ పై మోడీ పరోక్షంగా కామెంట్లు చేశారు. ఇద్దరి మధ్యన ద్వైపాక్షిక అంశాలతో పాటు సౌత్ ఏషియా వ్యవహారాలపై కూడా పలు అంశాలు చర్చకు వచ్చాయని భారత ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. వందేళ్ల స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఆఘానిస్థాన్ కు , పూర్తి ప్రజాస్వామ్య దేశంగా ఎదిగేందుకు ఇండియా తమ వంతు సహకారం అందిస్తుందని మోడీ పునరుద్ఘటి...