మారని పాకిస్తాన్..మండిపడ్డ ఆఫ్ఘాన్..శివమెత్తిన శివసేన

ఇండియాపై అవాకులు చెవాకులు పేలుతూ వస్తున్న పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మరోసారి రెచ్చి పోయారు ఎలాంటి అవగాహన లేకుండానే నిరాధార విమర్శలకు దిగారు. కశ్మీర్ విషయంలో నోరు జారారు. అంతర్జాతీయ వేదికలపై దాని గురించి ప్రస్తావించి, సమస్యను మరింత జఠిలం చేయాలని అనుకుని అభాసు పాలయ్యారు. ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఇదే అంశాన్ని లేవనెత్తేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ ఒక్క చైనా తప్పా ఏ దేశం పాకిస్థాన్ కు మద్దతు తెలపలేదు. ఈ సందర్బంగా భారత శాశ్వత ప్రతినిది సయ్యద్ అక్బరుద్దీన్ ఘాటుగా సమాధానం చెప్పారు.

ఏ దేశానికి తమ దేశంలో కల్పించుకునే హక్కు లేదని స్పష్టం చేసారు. కశ్మీర్ తమ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పారు. దీంతో తనకు వంత పాడుతూ వస్తున్న అమెరికా తాను ఏమీ చేయలేనని చేతులెత్తేసింది. ముందు మీ దేశంలో ఉన్న ఉగ్రవాద మూకల్ని వెళ్లగొట్టమని హెచ్చరించింది. అంతే కాకుండా ఆర్ధిక సాయంపై కోత విధించింది. ఇక రష్యా కశ్మీర్ విషయం ఇండియాకు చెందినదని పుతిన్ తెలిపారు. ఏ కంట్రీ పాక్ కు మద్దతు ఇవ్వక పోగా కశ్మీర్ భారత్ దేనని , తమకు సంబంధం లేదన్నారు.

దీంతో కక్కలేక మింగ లేక ఇమ్రాన్ ఖాన్ కారాలు మిరియాలు నూరుతున్నారు ఇండియాపై. ఇదే సమయంలో ఆఫ్ఘన్ జోక్యం చేసు కోవాలని కామెంట్స్ చేశారు. ఈ విషయంలో ఆఫ్ఘాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశం గురించి మాట్లాడే హక్కు పాక్ పీఎం కు లేదన్నారు. మరో వైపు శివ సేన శివమెత్తింది. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ది చెప్పే సమయం ఆసన్నమైందని పేర్కొంది. పాక్ ఇప్పుడు ఐసీయూలో ఉందని తన అధికార పత్రిక సామ్నాలో వ్యాఖ్యానించింది. ఇమ్రాన్ ఖాన్ ఇండియాపై ఆడి పోసుకోవడం కన్నా తమ దేశంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ద్రుష్టి పెడితే బావుంటుందని సూచించింది.

కామెంట్‌లు