లేటు వయసులో ఘాటు ప్రేమ..మన్మధా ఎందుకిలా..?

సభ్య సమాజం మెచ్చుకోలేదంటే అందులో ఏదో ఉన్నట్టే. అందుకే ఏముందో చూద్దామనే క్యూరియాసిటీ ఎక్కువగా కలుగుతుంది అప్పుడప్పుడు. అక్కినేని కుటుంబంలో హీరోలు ఎందరున్నా..నాగార్జున మాత్రం వెరీ డిఫరెంట్. నటుడిగా, ప్రయోక్తగా, బిజినెస్ మెన్ గా ఆయన సక్సెస్ అయ్యారు. ఏళ్ళు గడిచినా నాగ్ నటించిన మన్మధుడు ఇప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమలో టాప్. ఆ సినిమాకు డైలాగ్స్ ఎంత హిట్ అయ్యాయో సోనాలి, నాగ్, బ్రహ్మానందం , సునీల్ నటన మెప్పించింది. దేవి అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. దానికి కొనసాగింపుగా మన్మధుడు-2 సినిమా రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి తమిళ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. మహిళలు, పిల్లలకు నాగ్ అంటే కొంచం ప్రేమ. ఈ మధ్యన మా టీవీలో బిగ్ బాస్ ప్రోగ్రాం తో మరింత పాపులర్ అయ్యాడు .

ఎక్కువఅంచనాలతో వెళ్లిన సగటు తెలుగు ప్రేక్షకులు మన్మధుడు -2 సినిమా చూసి అవాక్కయ్యారు. కానీ వెళ్లలేక ఉండి పోయారు. కాదనుకుంటూనే సినిమాను ఎంజాయ్ చేశారు. సెలెబ్రెటీగా ఉన్న నాగార్జున బోల్డ్ గా నటించేందుకు ఎందుకు ఒప్పుకున్నారో అర్థం కాలేదంటూ కామెంట్స్ వచ్చినా, సినిమాను మాత్రం రిచ్ గా ఉండేలా తీశాడు రాహుల్. పోర్చుగల్ అందాలు. నాగ్ ఉండే ఇల్లు కళాత్మకంగా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. జీవితం అన్నది అదృష్టం. తోడు లేకపోతే నరకం. ఇదే సినిమాలోని థీమ్. అన్ని పాత్రలు అలా ఉంటాయి. మాట్లాడుకుంటాయి. కానీ తల్లీ , కొడుకు, మామయ్య , చెల్లెలు, అక్కలు, పిల్లలు..మధ్యలో ఆనందాలు. వీటన్నిటి మధ్యన కన్నవారి ప్రేమకు దూరమైన ప్రేమికురాలు. అలా వచ్చి ఇలా వెళ్లి పోతాయి పాత్రలు .

ఈ పాత్రకు సరైన న్యాయం చేసింది రకుల్ ప్రీతీ సింగ్. ఝాన్సీ ..రకుల్ మధ్య ముద్దు సీన్ ఉన్నా అది ఏమంత ఎబ్బెట్టు అనిపించదు. కథ పరంగా ఇది మాములే. కానీ రెస్టారెంట్ కు వెళ్లడం అక్కడ చోడలేని సీన్స్ చూడటం మాత్రం దర్శకుడి బుర్ర ఎందుకు పని చెయ్యలేదో అర్థం కాదు. తెలుగు వారు అమెరికాను ప్రేమిస్తున్నారు కానీ హాలీవుడ్ స్థాయికి ఇంకా చేరు కోలేదు. లైఫ్ పండాలంటే ముద్దులు ఉండాల్సిందేనని డైరెక్టర్ చెప్పకనే చెప్పారు. రొమాన్స్ అన్నది వికసించే పూవు లాంటిది ..అది వాడి పోక ముందే అందుకోవాలి. ఎంతైనా నాగ్ లేటు వయసులో ఘాటైన రొమాన్స్ పండించాడు. ఈ సినిమాలో మరిచిపోలేని పాత్ర ఏదన్నా ఉందంటే అది వెన్నెల కిషోర్ నటించిన కిశోర పాత్ర. సినిమా స్టార్ట్ నుంచి ఎండింగ్ కార్డు పడే దాకా నవ్విస్తాడు. మనతో పాటే వుండి పోతాడు. మొత్తం మీద వయసు అన్నది శరీరానికే కానీ మనసుకు కాదని, మడిగట్టుకు కూర్చుంటే లాభం లేదని, ప్రతి జీవికి తోడు అన్నది అవసరమని మన్మధుడు -2 మూవీతో రాహుల్ రవీంద్రన్ స్పష్టం చేశాడు. బోల్డ్ నెస్ అన్నది లేకుంటే ఈ సినిమా మరింత పొయెటిక్ గా ఉండేది. మొత్తం మీద నాగ్ నిరాశ పర్చడం బాధాకరం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!