స్ఫూర్తి శిఖరాలు ..గెలుపు గాథలు - సోషల్ సమోసా సంచలనం..!

ఒక్కొక్కరిది ఒక్కో పంథా. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట కొత్త ఆవిష్కరణ ప్రాణం పోసుకుంటోంది. చిన్నతనంలోనే అపారమైన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. తమకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని తపనతో రగిలి పోతున్నారు..ఇండియన్ యూత్. ఒకరు చెబితే పాఠాలు ఎందుకు వినాలి..మనమే కష్టపడదాం..పది మందికి బతుకునిద్దాం. త్వరగా ఎదగాలని అనుకోవడం లేదు మేం. మా తరమంతా సమాజాన్ని ప్రభావితం చేయడం కాకుండా ఎలా అభివృద్ధికి పునాది కావాలనే దానిపైనే మా క్రియేటివిటికి పదును పెడతామంటున్నారు. ఆంట్రప్రెన్యూర్స్‌గా, స్టార్టప్‌లను స్టార్ట్ చేసి వినూత్నంగా ఆలోచించడమే కాకుండా ఆచరణలో విజేతలుగా నిలబడుతున్నారు. వేలాది మందికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారు. ఎంతో కష్టపడి ..స్వంత ఖర్చులతో..ఎన్నో ఇబ్బందులకు గురవుతూ..పడుతూ లేస్తూ ..కాలంతో పాటే పరుగులు తీస్తున్నారు. ప్రింట్ , మీడియా , ఎంటర్ టైన్ మెంట్ రంగాలు దుమ్ము రేపుతున్నా అవి అసలైన విజేతల గురించి పరిచయం చేయడం లేదు. కార్పొరేట్ రంగాలు భాగస్వామ్యం వహించడమో లేదా యాజాన్యపు రంగంలో కీలకంగా వ్యవహరించడమే చేస్తుండడంతో వార...