స్ఫూర్తి శిఖరాలు ..గెలుపు గాథలు - సోషల్ సమోసా సంచలనం..!
ఒక్కొక్కరిది ఒక్కో పంథా. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట కొత్త ఆవిష్కరణ ప్రాణం పోసుకుంటోంది. చిన్నతనంలోనే అపారమైన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. తమకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని తపనతో రగిలి పోతున్నారు..ఇండియన్ యూత్. ఒకరు చెబితే పాఠాలు ఎందుకు వినాలి..మనమే కష్టపడదాం..పది మందికి బతుకునిద్దాం. త్వరగా ఎదగాలని అనుకోవడం లేదు మేం. మా తరమంతా సమాజాన్ని ప్రభావితం చేయడం కాకుండా ఎలా అభివృద్ధికి పునాది కావాలనే దానిపైనే మా క్రియేటివిటికి పదును పెడతామంటున్నారు. ఆంట్రప్రెన్యూర్స్‌గా, స్టార్టప్‌లను స్టార్ట్ చేసి వినూత్నంగా ఆలోచించడమే కాకుండా ఆచరణలో విజేతలుగా నిలబడుతున్నారు. వేలాది మందికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారు.
ఎంతో కష్టపడి ..స్వంత ఖర్చులతో..ఎన్నో ఇబ్బందులకు గురవుతూ..పడుతూ లేస్తూ ..కాలంతో పాటే పరుగులు తీస్తున్నారు. ప్రింట్ , మీడియా , ఎంటర్ టైన్ మెంట్ రంగాలు దుమ్ము రేపుతున్నా అవి అసలైన విజేతల గురించి పరిచయం చేయడం లేదు. కార్పొరేట్ రంగాలు భాగస్వామ్యం వహించడమో లేదా యాజాన్యపు రంగంలో కీలకంగా వ్యవహరించడమే చేస్తుండడంతో వారి అభిప్రాయాల మేరకే కథనాలు, స్టోరీలు , ఇంటర్వ్యూలు వస్తున్నాయి..ప్రసారమవుతున్నాయి. దీంతో సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యులకు వేదికలు దొరికాయి. తమకంటూ ఓ స్పేస్ లభిస్తోంది. ఇంకేం తమ టాలెంట్‌కు పదును పెడుతున్నారు. ప్రపంచాన్ని విస్తు పోయేలా చేస్తున్నారు. అలాంటి వారిని దొరకబట్టుకుని ..వారు ఎదిగేందుకు వేసిన అడుగులు..తీసుకున్న నిర్ణయాలు..అనుభవాలను ముంబయి కేంద్రంగా ఏర్పాటైన సోషల్ సమోసా వెబ్ పోర్టల్ వెలుగులోకి తెస్తోంది.
సామాజిక, ఆర్థిక, వ్యాపార, ఐటీ, తదితర రంగాలలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి చెందిన కథనాలు ఇందులో ఉన్నాయి. కంటెంట్ ..కనెక్టివిటిలో కొత్తదనంతో పాటు సమగ్ర విశ్లేషణ..ఆలోచించేలా సమాచారాన్ని ఇవ్వడం ఇందులో ప్రత్యేకత. ఒకరా ఇద్దరా కంటెంట్ రాయడంలో చేయి తిరిగిన రచయితలు ఉన్నారు. సోషల్ మీడియా కన్సల్టెంట్‌గా..ఆంట్రప్రెన్యూర్‌గా వినుతికెక్కిన అంకిత గాబా, ఆదిత్యా గుప్త సోషల్ సమోసా పేరుతో ప్రారంభించారు. అనతి కాలంలోనే ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. ఇందులో ఫ్రెష్, ఇండస్ట్రీ అప్‌డేట్స్, కంపెయిన్ స్పాట్, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్, ఈవెంట్స్ , సోషల్ బిజినెస్ విభాగాలు ఉన్నాయి. ఇండస్ట్రీ కనెక్ట్ విభాగంలో ఇంటర్వ్యూస్, ఏజెన్సీ స్పాట్‌లైట్, టూల్ స్పాట్ లైట్, ఏజెన్సీ ఫీచర్, ఫ్లాట్ ఫాం ఫీచర్, బ్రాండ్ మేనేజర్స్, ఇండియన్ సోషల్ మీడియా కోర్సులు, ఎక్స్‌పర్ట్స్ స్పీక్, గర్ల్స్ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు..సోషల్ సమోసా పౌండర్స్. ఆకట్టుకునే డిజైనింగ్..ఆలోచించేలా కంటెంట్..నమ్మకాన్ని పెంచేలా రైటింగ్ శైలి దీని ప్రత్యేకత. మెగా ఐకాన్స్ లాంటివి ఎన్నో వున్నాయి.
నాలుగేళ్ల తర్వాత ప్రతి ఏటా ఆదాయ వనరులు పెరిగాయి. దీంతో సోషల్ మీడియాలో సరికొత్త ఫ్లాట్‌ఫాంను క్రియేట్ చేసుకుని నిలబడిన సోషల్ సమోసాను స్టార్టింగ్ ఫౌండర్స్ రెండు కోట్లకు అమ్మేశారు. ఎప్పటికప్పుడు ఈ వెబ్ పోర్టల్ సరికొత్త హంగులతో దూసుకు వెళుతోంది. ఈ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే దేశంలో అత్యంత ప్రతిభావంతులైన ..సృజనాత్మకత కలిగిన ..చేయి తిరిగిన రచయితలు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. అద్భుతమైన రీతిలో కంటెంట్‌కు ప్రాణం పోస్తున్నారు. అపూర్వ చమారియా, బ్రిజేష్ జాకబ్, మోనికా బన్సాల్, తృప్తి లోచన్, అంకుర్ ఆస్తా, వరుణ్ దుగ్గిరాల, కళిక మిశ్రా, గౌరవ్, సమిత్ మల్కాని, దిమ్సీ మిర్‌చాందిని, గౌతం గోష్ , సంజయ్ మెహతా, కార్తిక్ శ్రీనివాసన్, లక్ష్మిపతి భట్, హర్షిల్ కారియా, వెంకె శర్మ, అంకిత గాబా, మను ప్రసాద్, సారంగ్ బ్రహ్మే, వర్జీనియా శర్మ ఇందులో వున్నారు.
వీరితో పాటు మరో వంద మందికి పైగా రచయితలు , మేధావులు భాగం పంచుకుంటున్నారు. తమ ఆలోచనలకు రెక్కలు తొడుగుతున్నారు. ఈ దేశపు గౌరవాన్ని ఇనుమడింప చేస్తూ..సమాజాన్ని ప్రభావితం చేస్తున్న విజేతల కథల్ని వెలుగులోకి తెస్తోంది సోషల్ సమోసా. వీలు దొరికితే వెతకండి.. గెలుపు గాథల అనుభవాలను పంచుకోండి. వారి నుండి స్ఫూర్తి పొందండి. మిమ్మల్ని మీరు దిద్దుకోండి. ఇక లైఫ్ కొత్తగా అగుపిస్తుంది కదూ..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి