ఆశలు ఫలించేనా..సింధు సాధించేనా..?

పూసర్ల వెంకట సింధు మరోసారి వార్తల్లో నిలిచారు. అంతర్జాతీయంగా బ్యాడ్మింటన్ లో మరో మెయిలు రాయి చేరుకునేందుకు ఆమె కొద్ది దూరంలో నిలిచి ఉన్నారు. వరల్డ్ ఛాంపియన్ షిప్ లో తనను ఎంతో కాలం నుంచి ఊరిస్తూ వస్తున్న బంగారు పతాకాన్ని అందుకునే అరుదైన అవకాశం ఆమెను వరించింది. గత రెండు సెషన్లలో సిల్వర్ తో సరి పెట్టుకుంది సింధు. తాను కన్న కలల్ని నిజం చేసుకునే ఛాన్స్ ఇప్పుడు దొరికింది. పసిడిని దక్కించుకునేందుకు మరోసారి రెడీ అయ్యింది. మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ లో మూడో స్థానంలో ఉన్న చైనాకు చెందిన క్రీడాకారిణి చెన్ యుఫెను సింధు ఓడించింది. ఫైనల్ పోరుకు రెడీ అయ్యింది. ఆమె ఆట తీరుతో అభిమానులను అలరించింది. కేవలం 40 నిమిషాల లోపే సింధు ఆట కట్టించింది. అంతిమ పోరులో నోజామి తో తలపడనుంది. ఇదిలా ఉండగా ఆమె వరుసగా మూడో సారి ఫైనల్లోకి దూసుకు వెళ్ళింది. మరో వైపు ప్రణీత్ ఓడి పోవడంతో కాంస్యం మాత్రమే దక్కింది. కొంత కాలంగా తనతో పాటు టాప్ షట్టర్లకు కొరకొర రాని కొయ్యగా మారిన వరల్డ్ ప్లేయర్ థై జూయింగ్ ను క్వార్ట్రర్స్ లోనే ఓడించింది సింధు. ఈ టోర్నీలో మొదటి నుంచి అద్భుతమైన రీతిలో ప్రతిభ కనబర్చింది. ఇప్పుడు సింధుకు 24 ఏళ్ళు. ...