సెలవంటూ వెళ్లి పోయిన జైట్లీ

భారతీయ జనతా పార్టీ మరో నిబద్దత కలిగిన , అపార అనుభవం కలిగిన నాయకుడిని కోల్పోయింది. ఓ రకంగా పార్టీకి తీరని నష్టం. మోడీకి అండగా ఉంటూ వచ్చిన అరుణ్ జైట్లీ తరలి రాని లోకానికి వెళ్లి పోయారు. గత కొంత కాలంగా మూత్ర పిండాలు, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. 2014 నుంచి జైట్లీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మోడీ మంత్రివర్గంలో కీలకమైన ఆర్ధిక , కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 2017 లో రక్షణ మంత్రిగా ఉన్న పారికర్ గోవా సీఎం గా వెళ్లడంతో ఆ శాఖ బాధ్యతలు చూశారు. 2016 లో సమాచార ప్రసార శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. తాజగా దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించినా , ఆరోగ్య పరిస్థితి కారణంగా కేంద్ర మంత్రివర్గంలో చేరలేదు.

ఆరోగ్య రీత్యా అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఎంపీగా ఉంటూనే ఇంటికే పరిమితమై పోయారు. ఢిల్లీలో చదువుకున్నారు. యూనివర్సిటీ విద్యార్ధి సంఘానికి  అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రం పట్టా అందుకున్నారు. ఏబీవీపీ లో ఉంటూ కీలక నేతగా ఎదిగారు. ఉద్యమకారుగిగా పని చేశారు. లా చదువుకున్న జేట్లీకి వాదించడం అంటే ఇష్టం. హైకోర్టు తో పాటు సుప్రీం కోర్ట్ లో లా ప్రాక్ట్స్ చేశారు. 1989 లో అదనపు సొలిసిటర్ జనరల్ గా ఎంపికయ్యారు. ఢిల్లీ హైకోర్టు లో సీనియర్ లాయర్ హోదా దక్కింది. 1991 నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు ఇండియా తరపున ప్రతినిధిగా పని చేశారు.

వాజ్ పేయీ ప్రభుత్వ హయాంలో సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. సామాజిక, న్యాయ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. ఇదే సమయంలో జైట్లీకి కేబినెట్ మంత్రి హోదా లభించింది. 2009 లో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కొంత కాలం పని చేశారు. ఇందిరా హయాంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ముందుగా అరుణ్ జేట్లీని అరెస్ట్ చేశారు. తీహార్ జైలుకు తరలించారు. అత్యయిక స్థితిని ఆయన గట్టిగా వ్యతిరేకించారు. జైలులో ఉన్నప్పుడే పలువురితో  పరిచయం ఏర్పడింది. మొత్తం మీద బీజీపీలో అపారమైన అనుభవం కలిగిన నాయకులలో ఒకడిగా జైట్లీ ఎప్పటికి ఉండి పోతారు.

కామెంట్‌లు