సీతమ్మ వరం .. మార్కెట్ కు ఊతం..!
మందగమనం లో చిక్కుకున్న భారతీయ మార్కెట్ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. అధిక సంపన్న వర్గాలకు మేలు చేకూర్చేలా సర్ చార్జీ ఇక ఉండబోదంటూ వెల్లడించారు. వాహన రంగం కుదేలైంది. ఎక్కువగా అమ్ముడు పోవడం లేదు. ప్రభుత్వం ఎడాపెడా పన్నుల మోత మోగిస్తుంటే ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో తయారీదారులు, కంపెనీలు కొనుగోలుదారులపై అధిక భారం వేస్తున్నాయి. దీంతో కొనుగోళ్లు ఆశించినంతగా జరగలేదు. బ్యాంకులు, ఎంబిఎఫ్సీలకు మద్దతు ప్రకటించారు. సాటర్ట్ అప్ లకు పన్నులు లేకుండా చేస్తున్నట్లు తెలిపారు. రేపో రేట్ కే ఇల్లు, వాహన వడ్డీ ధరలను అనుసంధానం చేయనున్నట్లు నిర్మల ప్రకటించారు.
కేవలం రెండు నెలల లోపే ఎంఎస్ ఎంఈ లకు జీఎస్టీ తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపారు. మొత్తం మీద గాడి తప్పిన ఆర్ధిక రంగానికి ఊతం ఇచ్చేలా నిర్ణయాలు తీసుకున్నారు మంత్రి. దేశీయ పరంగా అన్ని వర్గాల వారికి మేలు జరిగేలా చూసారు. విదేశీ పోర్ట్ ఫోలియో మదుపర్ల పై విధించిన అధిక పన్నులను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆర్ధిక మంత్రి తీసుకున్న ఈ కీలక నిర్ణయాలపై కార్పొరేట్ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పటి నుంచి ఊగిసలాడుతూ వస్తున్న ఇండియన్ మార్కెట్ కేంద్ర మంత్రి ప్రకటనతో మార్కెట్ లో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకునే వీలు కలుగుతుందని ఆశావహులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
డబ్బున్న వాళ్లకు లాభం చేకూర్చే విధంగా ఉండగా, సామాన్యులకు ఎలాంటి మేలు చేకూర్చేలా లేదని మేధావులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్ధిక రంగం కుదేలైందని, నిరుద్యోగం పెరిగి పోయిందని, ఉపాధి లేకుండా పోయిందంటూ మండి పడ్డారు. రెండో సారి పవర్ లోకి వచ్చిన ప్రభుత్వం కోట్లాది ప్రజలకు బతికేందుకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు కృషి చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంకురాలకు సంబంధించి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు సేవలందిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను మరింత బలోపేతం చేసేందుకు గాను ఏకంగా 70 వేల కోట్ల అదనపు మూల ధన నిధులను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సీతారామన్ స్పష్టం చేశారు.
దీని వల్ల కునారిల్లి పోతున్న బ్యాంకింగ్ రంగం మరింత బలపడే ఛాన్స్ ఉంది. రుణ ఎగవేత దారుల నుండి వసూలు చేయడం. తిరిగి చెల్లింపులు జరిగేలా చూడడం ముఖ్యమన్నారు. మౌలిక, గృహ రంగాలకు మరింత ఊతం ఇచ్చేలా అదనంగా మరో 20 వేల కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సర్ చార్జీ తగ్గించడం వల్ల ప్రభుత్వానికి మరింత భారీ నష్టం వాటిల్లుతుంది. అయినా ఆర్థిక పరంగా నిలదొక్కుకునేందుకు ఈ నిర్ణయం తీసు కోవాల్సి వచ్చిందన్నారు.ఆటోమొబైల్ రంగం బలపడేలా చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద సీతమ్మ వరాలు ఆర్ధిక రంగాన్ని గట్టెక్కిస్తుందో చూడాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి